అత్తాపూర్ : పేదలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు బస్తీలలో బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నట్లు రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ అన్నారు. మంగళవారం ఆయన అత్తాపూర్ డివిజన్ పరిధిలోని జలాల్భాబానగర్లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను ప్రారంబించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..
పేద, మద్యతరగతి కుటుంభాలకు వైద్యాన్ని మరింత చేరువ చేసేందుకు రాష్టప్రభ్తుత్వం బస్తీ దవఖానాలను ఏర్పాటు చేస్తుందని, ప్రజలందరు సద్వినియోగం చేసుకుకోవాలన్నారు. వైద్యం కోసం పేద ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్ళకుండా బస్తీలలో దవఖానాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
బస్తీ దవఖానాల సేవలను ప్రజలు వినియోగించుకోవాలని ప్రస్తుతం చిన్న, చిన్న అనారోగ్య సమస్యలకు కూడా పైవేటు ఆసుపత్రులలో వేలాదిరూపాయల ఖర్చు అవుతుందన్నారు. ఇంతకు ముందు ఏ ప్రభుత్వం కూడా పేదల ఆరోగ్యం కోసం ఆలోచించలేదని టీఆర్‌యస్ ప్రభత్వం పేదల ఆరోగ్యం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని గుర్తుచేశారు.
కార్పోరేట్ వైద్యాన్ని పేదలకు అందించేందుకు ప్రభుత్వం కృషిచేస్తుందని ఆయన గుర్తు చేశారు. ఆరోగ్య హైదరాబాదే లక్ష్యంగా జీహెచ్ఎంసీ ఆద్వర్యంలో బస్తీలలో దవాఖానలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో రాజేంద్రనగర్ సర్కిల్లో మరిన్ని దవాఖానలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా వైద్యధికారిని స్వరాజ్యలక్ష్మి ఇతర ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.