Chess tournaments | ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన క్రీడ చెస్ : రాష్ట్ర సాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి

సుల్తాన్‌బజార్ : ప్రపంచంలోనే చెస్ అత్యంత ప్రాచుర్యం పొందిన క్రీడ అని,అన్ని దేశాలల్లోనూ లక్షలాది మంది క్రీడాకా రులు ఎంతో ఇష్టంగా,దీక్షతో ఆడుతారని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు.
ఈ మేరకు సోమవారం ఎల్బీ స్టేడియంలోని సాట్స్ కార్యాలయంలో ఆల్ ఇండియా ఓపెన్ చెస్ క్రికెట్ టోర్నమెంట్ క్రీడల సంధర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన, తెలంగాణ చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు కె ఎస్ ప్రసాద్, మహ్మద్ షరీఫ్, ఏకాగ్ర చెస్ అకాడమి సీఈవో లక్ష్మీ సందీప్ నాయుడుతో కలిసి 2022 జనవరిలో నిర్వహిస్తున్న చెస్ టోర్నమెంట్ క్రీడలు బ్రోచర్‌ను ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ పోటీల లో పాల్గొనడంతో రాష్ట్ర స్థాయి క్రీడాకారులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. క్రీడాకారులు తమ స్థాయిని, నైపుణ్యా న్ని రేటింగ్స్‌ని పెంచుకోవడానికి ఇది చక్కని వేదిక అని అన్నారు. ఈ అధ్భుత అవకాశాన్ని రాష్ట్ర క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

తెలంగాణ చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు కేఎస్ ప్రసాద్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలోని కేవిబీఆర్ ఇండోర్ స్టేడియంలో ఇంత గొప్ప ఈవెంట్‌కు ఆతిథ్యం ఇస్తున్నందుకు గాను తెలంగాణ చెస్ అసోసియేషన్ సంతోషంగా భావిస్తుందన్నారు. ఈ టోర్నమెంట్ వల్ల రాష్ట్ర క్రీడాకారుల శక్తి సామర్ధ్యాలు, నైపుణ్యాలు మరింత మెళకువలు నేర్చుకోవడంతో పాటు అధ్భుత భవితకు బంగారు బాట కాగలదని అన్నారు.
ఏకాగ్ర చెస్ అకాడమి సీఈవో లక్ష్మీ సందీప్ నాయుడు మాట్లాడుతూ ఇక్కడి ఔత్సాహిక చెస్ క్రీడాకారులను అన్ని స్థాయిల్లో వ్యక్తిగత, వృత్తిపరమైన క్రీడా నైపుణ్యాలను, శక్తి సామర్ధ్యాలను జాతీయ, అంతర్జాతీయ స్థాయికి పెంపొందించే లక్ష్యంతో ఈ టోర్నమెంట్‌కు ఏకాగ్ర చెస్ అకాడమి శ్రీకారం చుట్టిందని అన్నారు.
ఈ టోర్నమెంట్లో సుమారు వెయ్యి మంది క్రీడాకారులు పాల్గొంటారని అన్నారు.ఈ పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి 21 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ఉంటుందని అన్నారు.
Read Today's Latest Districts-localnews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

