అంబర్పేట : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వర్ధంతి అంబర్పేట నియోజకవర్గంలోని పలు ప్రాంతా లలో సోమవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కాచిగూడ డివిజన్ లింగంపల్లి చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, కార్పొరేటర్ కన్నె ఉమారమేష్యాదవ్లు పూలమాల వేసి నివాళులు అర్పించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగం వల్లనే నేడు రిజర్వేషన్లు అమలవుతున్నాయన్నారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటు కూడా ఆయన చలవేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ అధ్యక్షుడు భీష్మాదేవ్, గోరక్సింగ్, వాల్మీకి సదానంద్, బాబ్జీ, మహేందర్యాదవ్, ఎల్.రమేష్, శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే అంబర్పేట శ్రీరమణ చౌరస్తాలో మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.