మహేశ్వరం :ఆషాడమాసం ముగింపు సందర్భంగా మండల పరిధిలోని కోళ్లపడకల్ గ్రామస్తులు బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. బోనాల పండుగ సందర్భంగా గ్రామాన్నంత వేపకొమ్మలు, మామిడి తోరణాలతో అలంకరించారు.
కులాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఉదయం నుంచి బోనాలు వండి అలంకరించారు. అనంతరం డప్పు చప్పుళ్లు, పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో ఊరేగింపుగా పోచమ్మ దేవాలయానికి చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అమ్మవార్లకు నైవేద్యాలు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు.