ముషీరాబాద్ :టీఎస్ఎస్పీడీసీఎల్ ఆజామాబాద్ డివిజన్ పరిధిలోని 11 కేవీ గోల్కొండ ఎక్స్ రోడ్, దాయర మార్కెట్, శాస్త్రీనగర్ ఫీడర్ల పరిధిలో విద్యుత్ లైన్ల మరమ్మత్తుల కారణంగా ఈనెల 7న (నేడు)శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఆ విభాగం ఏడీఈ ఎం.విజయభాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు గోల్కొండ ఎక్స్ రోడ్ ఫీడర్ పరిధిలోని సీటీఓ ఆఫీసు, రేస్ కోర్స్, వెస్లీ చర్చి, బాకారం, గోల్కొండ ఎక్స్ రోడ్ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4.30గంటల వరకు దాయర మార్కెట్ ఫీడర్ పరిధిలోని రిసాల, దాయర మార్కెట్, హరినగర్, సాగర్‌లాల్ ఆసుప్రతి, తాడి కాంపౌండ్ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదు.మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శాస్త్రీనగర్ ఫీడర్ పరిధిలోని శాస్త్రీనగర్, మోహన్‌నగర్, అచ్చయ్యనగర్, జెమినీ కాలనీ, సెయింట్ పాయిస్ స్కూల్ రాంనగర్ పరిసరాల్లో విద్యుత్ సరఫరా ఉండదు.