బేగంపేట్ : నెహ్రునగర్ క్లాక్‌టవర్ సబ్‌స్టేషన్ పరిధిలలో విద్యుత్ ఫీడర్లో తలెత్తిన సాంకేతిక లోపాలు, ట్రిమ్మింగ్లు కారణంగా బుధవారం వివిధ ప్రాంతాలలో విద్యుత్‌లో అంతరాయం ఉంటుందని విద్యుత్ ప్యారడైజ్ ఏడీఈ అధికారులు తెలిపారు. నెహ్రునగర్ సబ్‌స్టేషన్ రెజిమెంటల్‌బజార్ ఫీడర్ పరిధిలో ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు దీప్తీ అపార్ట్మెంట్, హరేరామ హరేకృష్ణా, సెయింట్ మేరీస్ హైస్కూల్, కీస్ హైస్కూల్, గోపాలపురం దర్గా, పరికిబస్తీ, ఆర్చన ఆర్కెడ్ ఏరియాలలో పై విధంగా విద్యుత్ సరఫరా నిలిపి వేస్తారు.
హరిహర కళాభవన్ ఫీడర్ పరిధిలో మధ్యాహ్నం 12 నుంచి మధ్యాహ్నాం 2 గంటల వరకు శ్రీరామనగర్, కళానికేతన్ బ్యాక్‌సైడ్, ఎన్టీపీసీ, కార్మికసంఘం, మున్సిపల్ కార్యాలయం ప్రాంతాలలో పై విధంగా విద్యుత్ ఉండదు. అలాగే క్లాక్‌టవర్ సబ్‌స్టేషన్ స్టేషన్ రోడ్డు ఫీడర్ పరిధిలో మధ్యాహ్నాం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు శ్రీనిధి, హెచ్‌పి పెట్రోల్‌పంపు, సెయింట్ ప్యాట్రిక్ స్కూల్, రెజిమెంటల్ బజార్, నాగార్జున హెల్త్ సెంటర్ తదితర ప్రాంతాలలో పై విధంగా విద్యుత్ నిలిపివేస్తారు.