నిర్మల్ టౌన్, ఏప్రిల్ 29 : జిల్లాలో వ్యవసా య భూములు సాగు చేసుకుంటున్న రైతులకు పక్కగా డిజిటల్ పాసుపుస్తకాలు అందించేందుకు ధరణి ద్వారా చర్యలు తీసుకోవాలని నిర్మల్ కలెక్ట ర్ ముషారఫ్ అలీ ఫారూఖీ రెవెన్యూ అధికా రుల ను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో శుక్రవా రం సాయంత్రం ఏర్పాటు చేసిన సమావే శంలో ఆయన మాట్లాడారు. నిర్మల్ జిల్లాలో ఇప్పటి వరకు ధరణి పోర్టల్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించేందుకు సత్వరం చర్యలు తీసుకోవాల ని ఆదేశించారు. పేర్ల మార్పిడి, భూమి స్వభావం, మిస్సింగ్ సర్వే అండ్ డివిజన్ నెంబర్, నోషనల్ ఖాతా మార్పు, పట్టా భూమి బదిలీ, భూమి అను భవంలో మార్పు, తదితర సేవలను క్షేత్రస్థాయి లో పరిశీలించాలని సూచించారు. అదనపు కలెక్ట ర్ రాంబాబు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
పీహెచ్సీలో ప్రజలకు మెరు గైన వైద్య సేవలందించాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ వైద్యాధికారులను ఆదే శించారు. అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే తో కలిసి సోన్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరో గ్య కేంద్రాన్ని సందర్శించారు. మాతా శిశు సంరక్ష ణ కోసం తీసుకుంటున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు.
ఓపీ, పెషెంట్ల వివరాలను పరిశీ లించిన ఆయన వైద్య సిబ్బంది సమయ పాలన పాటించి ప్రాథమిక చికిత్సలు అందేలా చూడాల ని కోరారు. ఎండ తీవ్రత నేపథ్యంలో ప్రజలకు వడదెబ్బపై అవగాహన కల్పించాలని సూచించా రు. జిల్లా వైద్యాధికారి ధన్రాజ్, డిప్యూటీ డీఎం అండ్ హెచ్వో శ్రీనివాస్, మాస్ మీడియా అధి కారి రవీందర్ పాల్గొన్నారు.
నిర్మల్ చైన్గేట్, ఏప్రిల్ 29 : దవాఖాన పరిస రాలు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ ఆదేశించారు. నిర్మల్ మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడేతో కలిసి సందర్శించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దవా ఖానలో ఎక్కడ పడితే అక్కడ చెత్త పారేయకుండా చూడాలని సూచించారు. పారిశుధ్య పనులు సక్ర మంగా చేపట్టాలన్నారు.
ఐపీ, ఓపీడీ వార్డులను పరిశీలించారు. రోగులకు సకాలంలో వైద్య సేవ లందించాలని వైద్యులను ఆదేశించారు. ప్రభుత్వ దవాఖానల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలని సూచించారు. జిల్లా వైద్యాధికారి ధన్రాజ్, ప్రధా న దవాఖాన సూపరింటెండెంట్ దేవేందర్ రెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.