ఎదులాపురం, ఏప్రిల్ 29 : ఎనిమిదో విడుత హరితహారంలో భాగంగా నిర్దేశించిన 44.74 లక్షల మొక్కలు నాటాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎనిమిదో విడుత హరిత హారం కార్యక్రమం అమలుపై సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో గిరి వికాసం పథకంలో భాగంగా 213 బోర్వెల్కు విద్యుద్దీకరణ ఏర్పాటు చేసేందుకు రూ.2కోట్ల 45 లక్షలు చెల్లించామని పేర్కొన్నారు. త్వరగా పను లు పూర్తి చేయాలని విద్యుత్ శాఖ ఎస్ఈ ఉత్తమ్ జాడేను ఆదేశించారు. అదనపు కలెక్టర్లు ఎన్ నటరాజ్, రిజ్వాన్ బాషా షేక్, డీఎఫ్వో రాజశేఖ ర్, అటవీ శాఖ అభివృద్ధి అధికారి రాహుల్ కిషన్ జాదవ్, డీఆర్డీవో కిషన్, డీపీవో శ్రీనివాస్, డీఈ వో ప్రణీత, మున్సిపల్ కమిషనర్ శైలజ, విద్యుత్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
పంట దిగుబడి అంచనాల సర్వేను పకడ్బందీగా చేపట్టాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయంలోని తన చాంబర్లో ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం వ్యవసాయ విస్తరణ, మండల ప్రణాళిక గణాంక అధికారులకు పంట కోత ప్రయోగాలకు సంబంధించిన (సీసీఈ కిట్) యంత్ర సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ పంట కోత ప్రయోగాలను వ్యవసాయ విస్తర ణ, మండల ప్రణాళిక, గణాంక అధికారులు సమన్వయంతో నిర్వహించాలని సూచించారు. బరువు కొలిచే యంత్రం, దిక్సూచి, తాటిపత్రు లు, కిట్ బ్యాగ్, పంట కోత నమోదు కార్డు కలిగిన కిట్లను జిల్లాలోని 18 మండలాలకు రెండు చొప్పున 36 సీసీఈ కిట్లు అందజేశామన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, జిల్లా అటవీ శాఖ అధికారి రాజశేఖర్, సీపీవో వెంకటరమణ, సిబ్బంది నరేశ్ పాల్గొన్నారు.