నార్నూర్, ఏప్రిల్ 28 : ఆదిలాబాద్ జిల్లాలోనే గాదిగూడ మారుమూల మండలం. మ హారాష్ట్రకు సరిహద్దు ప్రాంతానికి దగ్గరగా ఉం టుంది. అందుకే ప్రజల అవసరాలను దృష్టి లో ఉంచుకొని ఇక్కడ పీహెచ్సీ ఏర్పాటు చేశా రు. కానీ కనీస వసతులు కరువయ్యాయి. ఏ దైనా అనారోగ్య సమస్య కారణంగా ఇక్కడికి రావాలంటే ప్రజలు భయపడేవారు. రా నురాను వైద్యం కోసం వచ్చే రోగుల సంఖ్య తగ్గిపోయింది. ఇలా అధ్వానంగా ఉన్న దవాఖానను మెరుగైన స్థితిలో చేర్చేందుకు వైద్యశాఖ అధికారులు తీవ్రంగా కృషి చేశారు.
రెండేళ్లుగా ఒక్కో వసతి కల్పిస్తూ కొత్తహంగులతో స ర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఏకంగా జా తీయ స్థాయి అవార్డుకు ఎంపికయ్యేలా తీవ్ర కృషి చేశారు. సుమారు ఆరు డిపార్ట్మెం ట్లు, 250పైగా అంశాల్లో మెరుగైన ఫలితాలు వచ్చే లా శ్రమించారు. రూ.6 లక్షతో పీహెచ్సీలో మౌలిక వసతులు కల్పించారు. 18 నెల ల నుంచి జాతీయ స్థాయి అవార్డు ఎంపికలో ప రిగణనలోకి తీసుకునే అంశాలపై ప్రత్యేక శ్ర ద్ధ కనబర్చారు.
నిరంతరం జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు సలహాలు, సూచనలు చేశా రు. ఈ ఏడాది మార్చి 25, 26వ తేదీల్లో కేం ద్రీ య బృందం ప్రతినిధులు పీహెచ్‌సీని సం ద ర్శించారు. దవాఖానలోని ప్రతి విభా గం, ప లు అంశాలను క్షుణ్ణంగా పరిశీలించా రు. ప్రతిదానికి మార్కులు కేటాయించారు. దీం తో ఈ పీహెచ్‌సీకి 85.27 మార్కులు కేటాయించారు. ఎన్‌క్వాస్ అవార్డును అందజేశారు.
అవార్డు.. పారితోషికం..
కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడంతో పాటు పరిసరాల శుభ్రతలో గాదిగూడ మం డల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మేటిగా నిలుస్తున్నది. రోగికి ఎప్పుడు, ఏ చికి త్స చేయాలన్నా ఇక్కడి డాక్టర్లు, సిబ్బంది సి ద్ధంగా ఉంటున్నారు. మెరుగైన వైద్యం అందజేస్తూ ప్రశంసలు పొందుతున్నారు. పీహెచ్‌సీలోకి అడుగుపెట్టామంటే చాలు.. పచ్చని చెట్లు స్వాగతం పలుకుతున్నాయి. దీనికితోడు శుభ్రమైన రోడ్లు దర్శనమిస్తాయి. చెత్త ఎక్కడపడితే కనిపించదు.
పచ్చని చెట్ల నీడన రోగుల బం ధువులు సేదతీరుతున్నారు. కా గా.. జాతీయ స్థాయిలో మూడేండ్లకు ఒకసారి ఇచ్చే ఎన్‌క్వాస్(నేషనల్ క్వాలిటీ ఎన్యూరెన్స్ స్టాండర్డ్స్) అవార్డు కోసం కేంద్రీయ బృందం సభ్యులు వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకున్నా రు. ఆయా అంశాల్లో మెరుగ్గా ఉన్న వాటి ప్రకారం మార్కులు కేటాయించారు. దీంతో మొత్తంగా ఈ పీహెచ్సీ 85.27 మార్కులు సాధించింది.
ఆదిలాబాద్ జిల్లాలోనే మారుమూల మండలమైన గాదిగూడ పీహెచ్సీ అ వార్డు సాధించడంపై హర్షం వ్యక్తమవుతున్నది. ఈ అవార్డు కింద ఏడాదికి రూ.3 లక్షల చొప్పున వరుసగా మూడేండ్ల పాటు మొత్తం రూ.9 లక్షల పారితోషికం మంజూరు కానుం ది. ఎన్‌క్వాస్ అవార్డు సాధించడంలో విశేష కృషి చేసిన జిల్లా వైద్యశాఖ అధికారులు సిబ్బందిని అభినందించారు. జిల్లా వైద్యశాఖ అధికారుల సలహాలు, సూచనలు, పీహెచ్సీ వైద్య సిబ్బంది కృషితోనే ఎన్‌క్వాస్‌కు పీహెచ్సీ గుర్తించబడిందని మెడికల్ అధికారి పవన్ కుమార్ తెలిపారు.
గతంలో ఈ దవాఖాన కు రోగులు రావాలం టే భయపడ్డారు. ఇ ప్పుడు పరిస్థితులు మె రుగుపడ్డాయి. పీహెచ్సీ జాతీయ స్థాయి అవార్డుకు ఎంపికయ్యేందుకు ఇక్కడి సిబ్బంది నిరంతరం కృషి చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ దవాఖాన ను కార్పొరేట్ స్థాయికి దీటుగా తీర్చిదిద్దాం. వైద్య ఆరోగ్యశాఖ జిల్లా అధికారుల సలహా లు, సూచనలు పాటించాం. కేంద్ర బృం దం ఈ పీహెచ్‌సీని పరిశీలించింది. 85. 27శాతం మార్కులు కేటయించి ఎన్‌క్వాస్‌కు ఎంపిక చేసింది. అవార్డు రావడం సం తోషంగా ఉంది. జిల్లావైద్యశాఖ అధికారు లు, పీహెచ్సీ వైద్య సిబ్బంది కృషి ఎనలేనిది.
– పవన్‌కుమార్, మెడికల్ అధికారి, గాదిగూడ