ఎదులాపురం,ఏప్రిల్ 28 : హరితహారంలో భాగంగా ఈ యేడు 44.74లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించామని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో గురువారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… గతంలో నాటిన మొక్కలకు తప్పకుండా నీటి ని పోయాలన్నారు.
వచ్చే హరితహారానికి 52 లక్షల మొక్కలను అందుబాటులో ఉంచామన్నారు. డీఆర్డీఏ 25 లక్షలు, అటవీ శాఖ 8 లక్షలు, మున్సిపల్ 5 లక్షలు, ఐటీడీఏ లక్ష, మిగతావి వివిధ శాఖల ఆధ్వర్యంలో మొ క్క లు నాటాలని నిర్ణయించామని చెప్పారు. పల్లె ప్రకృతి వనాలు , బృహత్ వనాలు, అర్బ న్ పార్క్‌లు, మల్టీలెవల్ ఎవెన్యూ ప్లాంటేషన్, పె ద్దమొక్కల పెంపకం, జియో ట్యాగింగ్, తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు.
శుక్రవారం సీఎస్ హరితహారంపై కలెక్టర్లు, సంబంధిత శాఖ అధికారుల తో నిర్వహించనున్న వీడియోకాన్ఫరెన్స్ సందర్భంగా ముందస్తుగా సమావేశం నిర్వహించామని తెలిపారు. సమావేశంలో ఐ టీడీఏ పీవో అంకిత్, అదనపు కలెక్టర్లు ఎన్. నటరా జ్, రిజ్వాన్ భాషా షేక్, , డీఎఫ్‌వో రా జశేఖ ర్, ఆర్డీవో రాజేశ్వర్, డీఆర్డీవో కిషన్, మున్సిపల్ కమిషనర్ శైలజ, అ దనపు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రవీందర్ రాథోడ్, పంచాయతీరాజ్, రోడ్లు, భవనా లు, మున్సిపల్ ఇం జినీర్లు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఎదులాపురం, ఏప్రిల్ 28 : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరగా పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయం అందేలా చూడాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మం దిరంలో ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన జిల్లా స్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. 2021 సంవత్సరంలో 33 కేసులకు 27 కేసులు పెండింగ్ ఉన్నాయని, ట్రయల్‌లో ఒక కేసు విచారణలో ఉందన్నారు.
అదేవిధంగా 2022లో ఇప్పటివరకు 18 కేసులకు 7 పెండింగ్ ట్రయల్‌లో ఉన్నాయని, మిగితా 11 కేసులు విచారణ స్థాయిలో ఉన్నాయని తెలిపారు. ఇప్పటివరకు రూ.56 లక్షలను ఉపశమనం కింద బాధితులకు పరిహారం కింద అందించామని తెలిపారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలు, బాధితులకు అందిస్తున్న న్యాయసేవలు, పరిహారంపై నివేదికలను అందజేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
సమావేశంలో అదనపు కలెక్టర్లు ఎన్. నటరాజ్, రిజ్వాన్ భాషా షేక్, ఐటీడీఏ పీవో అంకిత్, ఆర్డీవో రాజేశ్వర్, డీఎస్పీ వెంకటేశ్వరారావు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులు సునీతాకుమారి, రాజలింగం, కృష్ణవేణి, ఏబీసీడీవో సంధ్యారాణి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, సీఐ సైదారావు, వివిధ శాఖల అధికారులు , కమిటీ సభ్యులు పాల్గొన్నారు.