ఎదులాపురం, ఏప్రిల్ 11 : బడుగు, బలహీనవర్గాల్లో ఆత్మైస్థెర్యం నింపి, వారి హక్కుల కోసం పోరాడిన మహనీయుడు మహాత్మా జ్యోతిబాఫూలే అని, ఆయన సేవలు మరువలేనివని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక బీసీ స్టడీ సర్కిల్లో ఫూలే 196వ జయంతి వేడుకలను నిర్వహించారు. ముందుగా ఎస్సీ కార్పొరేషన్‌లోని ఫూలే దంపతులు, అంబేద్కర్, బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహాలకు అధికారులు పూలమాలలు వేశారు.
అనంతరం బీసీ స్టడీ సర్కిల్లోని విగ్రహానికి, కార్యక్రమ స్థలంలో ఏర్పాటు చేసిన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సమాజానికి, మహిళల అభ్యున్నతి కోసం జ్యోతిబాఫూలే చేసిన సేవలు మరువలేనివన్నారు. వారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని పిలుపునిచ్చారు. జిల్లా బీసీ సంక్షేమ శాఖ ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలుచేస్తున్నట్లు చెప్పారు. స్థానిక బీసీ స్డడీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్-1,2,3,4, కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలకు ఉచిత శిక్షణతో పాటు ైస్టెఫండ్, పుస్తకాలు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ కోసం యువత http://study circle.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించా రు.
విద్యార్థులకు ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ మంజూరుకు చర్యలు చేపడుతున్నామన్నారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ జోగు ప్రే మేందర్ మాట్లాడుతూ.. మహనీయుల అడుగుజాడల్లో బీసీ గురుకులాలు స్థాపించి నాణ్యమైన చదువు అందిస్తున్నామన్నా రు. ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత శిక్షణను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వివిధ కుల సంఘాల ప్ర తినిధులు మాట్లాడుతూ.. అణగారిన వర్గాల ప్రజల అభివృద్ధికి ఫూలే దంపతులు చేసిన సేవలను కొనియాడారు. పాఠశాల స్థా యి నుంచి మహనీయుల జీవిత చరిత్రను విద్యార్థులకు తెలియజేసేలా జిల్లాలోని అన్ని విద్యాసంస్థల్లో ఫూలే జయంతి వేడుకలు నిర్వహించేలా అదేశాలు జారీ చేయాలని కలెక్టర్‌కు విన్నవించారు.
చిన్నారుల ప్రదర్శనలను ప్రముఖులు తిలకించారు. మహాత్మా జ్యోతిబాఫూలే దంపతుల వేషధారణలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్ నటరాజ్, డీబీసీడీవో రాజలింగు, డీపీఆర్వో ఎన్ భీమ్ కుమార్, డీఎస్సీడీవో భగత్ సునీతాకుమారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, బీసీ కుల సంఘాల ప్రతినిధులు సత్యనారాయణ, పార్థసారథి. ప్రమోద్ కుమార్ ఖత్రి, సుకుమార్ పెట్కులే, మోహన్‌బాబు, శ్రీనివాస్, చిక్కాల దత్తు, బీసీ స్డడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, ఆశమ్మ, టీఆర్ఎస్ బీసీ సెల్ పట్టణాధ్యక్షుడు దాసరి రమేశ్, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
నిర్మల్ టౌన్, ఏప్రిల్ 11 : మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆశయాలు సాధించాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. కలెక్టరేట్లోని బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు హేమంత్ బోర్కడే, రాంబాబు, బీసీ సంక్షేమశాఖ సహాయ అధికారి నాగారావు, సి బ్బంది కలీం, రవికుమార్, సంఘాల నాయకులు కృష్ణంరాజు, సుంకెట పోశెట్టి, ముడుసు సత్యనారాయణ పాల్గొన్నారు.