నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 28 : పట్టణంలోని గాజుల్పేట్ కాలనీలో గురువారం రాత్రి మైనార్టీ నాయకులు నిర్వహించిన ఇఫ్తార్‌కు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. వా రితో కలిసి విందులో పాల్గొన్నారు. అంతకుముందు మైనార్టీ నాయకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. కా ర్యక్రమంలో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్ట ర్లు హేమంత్ బోర్కడే, రాంబాబు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్య దర్శి వీ సత్యనారాయణ గౌడ్, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ఎం పీపీ రామేశ్వర్ రెడ్డి, మైనార్టీ కౌన్సిలర్లు, నాయకులు ఉన్నారు