బోథ్, ఏప్రిల్ 27 : సీఎం కేసీఆర్ సారథ్యంలోనే తెలంగాణ అభివృద్ధి పథంలో పయనిస్తున్నదని జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు తాహెర్బిన్సలాం పేర్కొన్నారు. బోథ్ నియోజకవర్గ వ్యాప్తంగా బుధవారం టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బోథ్, ధన్నూర్(బీ), కౌఠ(బీ), సొనాల, పొచ్చెర, కన్గుట్ట, రఘునాథ్‌పూర్ గ్రామాల్లో పార్టీ జెండాలను ఎగురవేశారు. జై తెలంగాణ…జైజై కేసీఆర్ అంటూ నాయకులు నినాదాలు చేశారు. కార్యక్రమాల్లో రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి, నారాయణరెడ్డి, గంగాధర్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, గ్రామ కమిటీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇచ్చోడ, ఏప్రిల్ 27 : మండల కేంద్రంతో పాటు బోరిగామ, సిరిచెల్మ, అడెగామ(కే), మల్యాల, మాదాపూర్, తలమద్రి, మాన్కపూర్, సాథ్‌నంబర్, దేవుల్నాయక్తండా గ్రామాల్లో టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఇచ్చోడలో ఎంపీపీ నిమ్మల ప్రీతమ్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి, పార్టీ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు ముస్తఫా, నాయకులు దాసరి భాస్కర్, రాథోడ్ ప్రవీణ్, గణేశ్, గుండాల శ్రీకాంత్, గుంజాల భాస్కర్ రెడ్డి, అబ్దుల్ రషీద్, భీముడు, గంగయ్య, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
భీంపూర్, ఏప్రిల్ 27 : మండలంలోని అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రత్నప్రభ, వైస్‌ఎంపీపీ గడ్డం లస్మన్న, సర్పంచ్‌లు స్వాతిక, నిమ్మ వేణుయాదవ్, బక్కి లలిత, గొల్ల రమాబాయి, పెండెపు కృష్ణయాదవ్, రైతు బంధు సమితి ప్రతినిధులు అనిల్, రాథోడ్ ఉత్తమ్, నాయకులు నరేందర్‌రెడ్డి , కల్చాప్యాదవ్, దినేశ్, కార్యకర్తలు పాల్గొన్నారు.
నేరడిగొండ, ఏప్రిల్ 27 : మండల కేంద్రంలోని తెలంగాణతల్లి విగ్రహం వద్ద వైస్‌ఎంపీపీ మహేందర్‌రెడ్డి టీఆర్ఎస్ జెండాను ఎగురవేశారు. కుమారి, నేరడిగొండ, తర్నం, వాంకిడి, వడూర్, కొర్టికల్, బుగ్గారం గ్రామాల్లో పార్టీ గ్రామ అధ్యక్షులు జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో కుమారి పీఏసీఎస్ చైర్మన్ మందుల రమేశ్, సీనియర్ నాయకులు చంద్రశేఖర్‌యాదవ్, మురళీగౌడ్, పీవీ రమణ, శంకర్, కుంట కిరణ్‌కుమార్‌రెడ్డి, జాదవ్ కపిల్, సర్పంచ్‌లు విశాల్‌కుమార్, రాజుయాదవ్, కార్యకర్తలు పాల్గొన్నారు.
గుడిహత్నూర్, ఏప్రిల్ 27 : మండల కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు బూర్ల లక్ష్మీనారాయణ పార్టీ జెండాను ఎగురవేశారు. మండలంలోని తోషం, కొల్హారి, ముత్నూర్, మన్నూర్ గ్రామాల్లో టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుడు జమీర్, మాజీ ఎంపీపీ కుమ్మరి సత్యరాజ్, మాజీ జడ్పీటీసీ కేశవ్, జిల్లా, మండల నాయకులు జాదవ్ రమేశ్, బొజ్జ నారాయణ, రాజేశ్వర్, మాధవ్, జలంధర్, దిలీప్, సురేశ్, వినోద్, ఆనంద్ కార్యకర్తలు పాల్గొన్నారు.
బోథ్, ఏప్రిల్ 27 : టీఆర్ఎస్ 21వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో బుధవారం నిర్వహించిన ప్లీనరీ సమావేశానికి ఆదిలాబాద్ మాజీ ఎంపీలు సముద్రాల వేణుగోపాలాచారి, నగేశ్, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జడ్పీచైర్‌పర్సన్ కోవ లక్ష్మి, బోథ్, ఇచ్చోడ మండలాల నాయకులు హాజరయ్యారు. బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు బీ శ్రీధర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ దావుల భోజన్న, బోథ్, ఇచ్చోడ టీఆర్ఎస్ మండల కన్వీనర్లు ఎస్ రుక్మాణ్‌సింగ్, ఏనుగు కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
బజార్హత్నూర్, ఏప్రిల్ 27 : మండలంలోని దేగామ, బజార్హత్నూర్, పిప్పిరి, గిర్నూర్, వర్తమన్నూర్, టెంబి గ్రామాల్లో టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు పార్టీ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల కన్వీనర్ రాజారాం, నాయకులు సాయన్న, జగదీశ్, ఈశ్వర్, విలాస్, శేఖర్, అక్షయ్ పాల్గొన్నారు.
తలమడుగు, ఏప్రిల్ 27: తలమడుగు, సుంకిడి, కజ్జర్ల, పల్లి, సాయిలింగి, ఖోడద్ గ్రామాల్లో టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సిరికొండ, ఏప్రిల్ 27 : మండల కేంద్రంతో పాటు సొంపల్లి, పొన్న, రాంపూర్, లక్ష్మీపూర్, వాయిపేట్, ధర్మసాగర్ గ్రామాల్లో టీఆర్ఎస్ నాయకులు పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు బాలాజీ, ఈశ్వర్, సూర్యకాంత్, బషీర్, అశోక్, మల్లేశ్, గంగాధర్, సునీల్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.