పల్లెలు పచ్చగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. ఏ దేశానికైనా పల్లెలే పట్టుగొమ్మలు. అనే నానుడిని నిజం చేయాలని రాష్ట్ర సర్కారు పల్లెలపై దృష్టి సారించింది. పరిశుభ్రత పెంపొందించడం, పచ్చదనం వెల్లివిరిసేలా చేయడం, సీజనల్ వ్యాధులను రూపుమాపడం వంటి వాటి కోసం ఏటా పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది.
ఇప్పటివరకు నాలుగు విడుతలుగా పల్లె, మూడు విడుతలుగా పట్టణ ప్రగతి కార్యక్రమాలు నిర్వహించింది. గతంలో నిర్వహించినవి సత్ఫలితాలివ్వడంతో ఈ యేడాది కూడా మే 20 నుంచి జూన్ 5 వరకు నిర్వహించాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. జూన్ మొదటి వారం నుంచి వానకాలం ప్రారంభం కానుండడంతో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా కూడా చర్యలు తీసుకోనుంది.
ఆదిలాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పల్లెలు, పట్టణాల సమగ్ర వికాసమే లక్ష్యంగా ప్రభుత్వం అనేక కార్యక్రమా లు నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు అమలు చేస్తున్నది. పల్లె ప్రగతి మొదటి విడుత 2019 సెప్టెంబర్ 6 నుంచి అక్టోబర్ 5 వరకు నెల పాటు నిర్వహించారు. పట్టణ ప్రగతి 2020 ఫిబ్రవరి 24 నుంచి మార్చి 4 వరకు చేపట్టా రు. ఇప్పటివరకు నాలుగు విడుతలుగా చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలనిచ్చాయి.
గ తంలో అస్తవ్యస్తంగా ఉన్న పల్లెలు పరిశుభ్రం గా మారాయి. పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. పట్టణాల్లో కూడా పరిశుభ్రమైన వాతావరణం నెలకొనడంతో సీజనల్ వ్యాధులకు అడ్డుకట్ట పడింది. మరోసారి పల్లె, పట్టణ ప్రగతి నిర్వహించాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. మే 20 నుంచి జూన్ 5 వరకు ఉ మ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 11 మున్సిపాలిటీలు, 1,509 గ్రామ పంచాయతీల్లో కార్యక్రమాలు చేపట్టనున్నారు.
మున్సిపాలిటీల్లో మూడు విడుతలుగా పట్టణ ప్రగతి కార్యక్రమాలు నిర్వహించారు. సీజనల్ వ్యాధుల నివారణలో భాగంగా మురుగు కా ల్వలను శుభ్రపర్చడం, మంచినీటి పైపు లైన్లు, నల్లాల లీకేజీ లేకుండా మరమ్మతులు చేశారు. పట్టణాల్లోని డ్రైనేజీలను శుభ్రపర్చి వరదనీరు నిలువకుండా చర్యలు చేపట్టారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, దవాఖానలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు పరిసరాలు శుభ్రం గా ఉండేలా చూడడంతోపాటు వరద నీరు నిల్వకుండా పనులు చేపట్టారు. బావుల్లో క్లోరినేషన్ చేయడంతోపాటు విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టారు.
పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఇప్పటివరకు నాలు గు విడుతలుగా చేపట్టారు. అనారోగ్య సమస్యలు దూరమవడంతోపాటు పచ్చదనం వెల్లివిరుస్తున్నది. సర్కారు ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీని పంపిణీ చేసిం ది. కొత్త పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం 10 శాతం నిధులు పచ్చదనానికి వినియోగిస్తున్నా రు. పల్లె ప్రకృతి వనాలు, డంప్ యార్డులు, వై కుంఠధామాలను ఏర్పాటు చేశారు.
ప్రతి పం చాయతీలో నర్సరీలను ఏర్పాటు చేసి ఇం టింటా ఆరు మొక్కలు నాటేలా చర్యలు తీసుకున్నారు. పాడుబడ్డ ఇండ్లు, బంగ్లాలు, బావులను కూల్చివేశారు. మరుగుదొడ్ల నిర్మాణాలతోపాటు వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించారు. సర్కారు తుమ్మలు, పెంట కు ప్పలు పనికిరాని వాటిని తొలగించి గ్రామాలు శుభ్రంగా కనిపించేలా చర్యలు తీసుకున్నారు.
వంగిపోయి ప్రమాదకరంగా మారిన విద్యుత్ స్తంభాలను తొలగించి ఎల్ఈడీ బల్బులు పెట్టారు. వేలాడుతున్న కరెంట్ తీగలను సరిచేశారు. గ్రామాల్లోని ఖాళీస్థలాలతోపాటు రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటారు. ప్రతి పల్లెలో తడి, పొడి చెత్తను సేకరించేందుకు ట్రై సైకిళ్లు అందించారు. సేంద్రియ ఎరువుల త యారీ కోసం సెగ్రిగేషన్ షెడ్లను నిర్మించారు. ఈ సారి చేపట్టబోయే పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా సీజనల్ వ్యాధుల నివారణతోపాటు ఇతర పనులు చేపట్టనున్నారు.