కడెం, ఏప్రిల్ 16 : తెలంగాణ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఖానా పూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ పేర్కొన్నా రు. కడెం మండలకేంద్రంలోని హరిత రిసార్ట్‌లో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో శనివారం కడెంకు చెందిన 60 మందికి పైగా టీఆర్ఎస్లో చేరారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీకి భవిష్యత్ లేదన్నారు. మాజీ సర్పంచ్ చిట్యాల చిన్నయ్య, ఉపసర్పంచ్ జాకీర్ హుస్సేన్, ముబారక్ బిన్ మహ్మద్, ఇస్లావత్ గంగారాం, ఖాజాఖాన్, జావీద్, షకీర్‌తో పాటు, 60 మందికి పైగా టీఆర్ఎస్లో చేరారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జన్నల చంద్రశేఖర్, ఎంపీపీ అంథోనీ అలెగ్జాండర్, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు రఫీక్ హైమద్, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు నల్ల జీవన్‌రెడ్డి, నాయకులు ఆకుల లచ్చన్న, బోయిని మంగ, అజ్మీరా శంకర్ నాయక్, రాజేశ్వర్‌గౌడ్, గౌసొద్దీన్, హాసీబ్, బొడ్డు గంగన్న, రాజేశ్, బద్దెనపల్లి స్టీఫెన్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.