ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం అర్ధరాత్రి నుంచి ఈదురుగాలులతో కురిసిన వర్షం తీరని నష్టాన్ని మిగిల్చింది. ఆయా చోట్ల పంటలతోపాటు చెట్లు నేలకొరగగా, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. కల్లాల్లోని ధాన్యం తడిసి ముద్దవగా, టార్పాలిన్లు కప్పి పంటను కాపాడుకునేందుకు రైతాంగం తీవ్రంగా శ్రమించింది. పలు ప్రాంతాల్లో వరి, మక్క, మామిడి పంటలు పూర్తిస్థాయిలో దెబ్బతినగా, ఆయా చోట్ల నష్టం అంచనాకు అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. మరోవైపు రైతన్నలకు అండగా ఉంటామని. ప్రతి గింజా కొంటామని ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు భరోసానిచ్చారు.
నేరడిగొండ/దస్తురాబాద్/పెంబి/కడెం/ఖానాపూర్ రూరల్,మే 4 : ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని సావర్గాం, తేజాపూర్, బుద్దికొండ, వాంకిడి, యాపల్‌గూడ, కొర్టికల్, రోల్మామడ, కిష్టాపూర్,బుగ్గారం కే బుగ్గారం (బీ), కుంటాల, నేరడిగొండ, లఖంపూర్ తదితర గ్రామాల్లో రాత్రి వర్షంతో పాటు ఈదురుగాలులు వీచాయి. సావర్గాం, బుగ్గారం కె, నేరడిగొండలో పలు ఇండ్ల పైకప్పులు లేచిపోయాయి. దీంతో నిత్యావసర వస్తువులు, బట్టలు, సామగ్రి తడిచిపోయా యి. విద్యుత్ తీగలు తెగిపోయాయి. దీంతో ఆయా గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిం ది. ఈదురు గాలులతో పాటు ఉరుములు, మెరుపులు ప్రజలను భయబ్రాంతులకు గురిచేశాయి. పెంబి మండలంలోనూ వరి, నువ్వుల పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. కడెం మండలంలోని గంగాపూర్‌లో వరి, మక్క పంటలకు నష్టం వాటిల్లింది. గ్రామానికి చెందిన రాథోడ్ గంగాధర్, భుక్యా సుభాష్, తదితరుల పంట నేలకొరిగింది. కరెంట్‌కు పూర్తిస్థాయిలో అంతరాయం కలిగింది. ఖానాపూర్ మండలంలోని తర్లపాడు, పాత తర్లపాడు, సత్తనపల్లి, బీర్నంది గ్రామాలోల వరి, నువ్వు పంటలకు అధిక నష్టం వాటిల్లింది.
మున్సిపల్ పాలకవర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించి. వారి సేవలను గుర్తించిన సర్కారు పాలక వర్గాల గౌరవ వేతనాన్ని 30 శాతం పెంచింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వేతనాల పెంపు 2021 జూన్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు ఉత్తర్వులో పేర్కొంది. ఇదిలాఉంటే నిర్మల్ జిల్లాలో నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీలు ఉన్నాయి.
అడగక ముందే పాలక వర్గాల గౌరవ వేత నం పెంచిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞత లు. దేశంలో ఎక్కడా లేని విధంగా పట్టణ ప్రగ తి ద్వారా మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రతి నెలా నిధులు సమకూర్చుతున్నారు.
(కౌన్సిలర్, చందులాల్)
పాలక వర్గాల గౌరవ సభ్యుల వేతనాలు పెంచడం ఆనందంగా ఉంది. మున్సిపాలిటీ ల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ప్ర భుత్వానికి ధన్యవాదాలు. వేతనాలు పెం చడంతో మాపై మరింత బాధ్యత పెరిగింది. ప్రభుత్వ ఆశయానికి అనుగుణం గా పనిచేసి బల్దియాను మరింత అభివృద్ధి చేస్తాం.
(ఇంతియాజ్, కోఆప్షన్ మెంబర్)