ఎదులాపురం, మే 3 : మహాత్మా బసవేశ్వరుడి సేవలు చిరస్మరణీయమని ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ ఎన్ నటరాజ్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఎదుట ఉన్న విగ్రహం వద్ద మంగళవారం బసవేశ్వరుడి 889వ జయంతి నిర్వహించారు. ముం దుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. బసవేశ్వరుడి చిత్రపటం, విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
సమాజానికి బసవేశ్వరుడు చేసిన సేవ లు మరువలేనివని పేర్కొన్నారు. హైందవ మతా న్ని సంస్కరించిన ప్రముఖుల్లో ఆయన ఒకరని గుర్తుచేశారు. బసవేశ్వరుడు కర్ణాటకలోని బాగేవాడిలో జన్మించారని, కుల, వర్ణ, లింగ బేధాలు లేవ ని సుమారు 800 ఏండ్ల క్రితమే ఆయన చెప్పారని తెలిపారు. బసవేశ్వరుడి జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
పవిత్ర రంజాన్, మహాత్మా బసవేశ్వరుడి జయంతి సందర్భంగా ప్రజలందరికీ జిల్లా యంత్రాంగం తరఫున అదనపు కలెక్టర్ శు భాకాంక్షలు తెలిపారు. డీబీసీడీవో రాజలింగం, డీఎస్పీ వెంకటేశ్వరరావు, తహసీల్దార్ భోజన్న, వార్డు కౌన్సిలర్ శ్రీనివాస్, లింగాయత్ కులస్తులు భోజ్జవారి విరానంద, వీరేశ్, వీరప్రసాద్, బీసీ సం ఘం నాయకులు అన్నదానం జగదీశ్వర్, చిక్కల దత్తు, ప్రమోద్ కుమార్ ఖత్రి,వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ రూరల్ మండలంలోని తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ రెండో బెటాలియన్ యాపల్గూడలో బసవేశ్వర జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కమాండెంట్ వేణుగోపాల్ బసవేశ్వర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అడిషనల్, అసిస్టెంట్ కమాం డెంట్ జయరాజు, డీవీ నరసింహరాజు, ఆర్ఐ సీఐ, ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు.