ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ నారాయణపేట టౌన్, ఆగస్టు 30: బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రాబోయే రెండురోజులు రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని, జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అధికారుకు సూచించారు. హైదరాబాద్ నుంచి డీజీపీ మహేందర్‌రెడ్డి, సంబంధిత శాఖల ముఖ్య కార్యదర్శులతో సోమవారం జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ జిల్లాలో ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం కలుగకుండా ప్రత్యేక అధికారులను అప్రమత్తం చేశామన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా చూడాలని, వాగులను ప్రజలు, వాహనదారులు దాటకుండా చూడాలని, అవసరమైతే అటువైపు వెళ్లకుండా రోడ్డు మళ్లించాలని పోలీస్‌శాఖకు సూచించారు. గ్రామాల్లో రెవెన్యూ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, మండల అధికారులు అప్రమత్తంగా ఉంటూ పరిస్థితులను పర్యవేక్షించి ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఆదేశాలు జారీ చేయాలని అదనపు కలెక్టర్‌కు సూచించారు. వీసీలో ఎస్పీ చేతన, అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, పాల్గొన్నారు. హరితహారం వివరాలు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి సీఎం కేసీఆర్ సూచనల మేరకు 2019, 2020లో హరితహారంలో నాటిన మొక్కల మూల్యంకనం సైట్ల వారీగా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి శాంతకుమారి అటవీశాఖ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి వర్చ్యువల్ సమావేశం ద్వారా సోమవారం కలెక్టర్లు, అటవీశాఖ అధికారులు, డీఆర్డీవో, మున్సిపల్ కమిషనర్లకు పలు సూచనలు ఇచ్చారు. అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 2019లో మున్సిపాలిటీ ద్వారా 1, పంచాయతీరాజ్, ఇతర శాఖల ద్వారా 121 సైట్లలో మొక్కలు నాటామన్నారు. 2020లో మున్సిపాలిటీ ద్వారా 2, ఇతర శాఖల ద్వారా 94 సైట్లలో హరితహారం మొక్కలు పెంచామన్నారు. మొత్తం 218 సైట్లను పర్యవేక్షించి నివేదిక ఇచ్చేందుకు 14బృందాలను ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీచేశామన్నారు. బృందాలకు శిక్షణ ఇచ్చి క్షేత్రస్థాయిలో సేకరించిన సమాచారాన్ని నిర్ణీత ప్రొఫార్మాలో పొందుపరిచి ఆన్లైన్లో అప్లోడ్ చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. సమావేశంలో డీఆర్డీవో గోపాల్‌నాయక్, ఫారెస్టు రేంజ్ అధికారి నారాయణరావు, డీపీవో మురళి, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.