అలంపూర్, ఆగస్టు 30 : కుల వివక్షతలేని సమాజం కోసం అందరూ కృషి చేయాలని ఆర్ఐ కరీం పిలుపునిచ్చారు. మండలంలోని కోనేరు గ్రామంలో సర్పంచ్ లక్ష్మన్న అధ్యక్షతన సోమవారం పౌరహక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు గ్లాసుల పద్ధతి, దళితుల ఆలయ ప్రవేశం, అంటరానితనం నిర్మూళన తదితర అంశాల గురించి చర్చించారు. కార్యక్రమం లో ఎంపీవో చంద్రకళ, గ్రామ కార్యదర్శి నాగేంద్రమ్మ, ఎస్సీ హాస్టల్ వార్డెన్ హేమచందర్ రావు, నరేశ్, హెచ్ఎం కృష్ణ, అంగన్వాడీ టీచర్ నాగరత్నమ్మ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
సమానత్వాన్ని పాటించాలి
వడ్డేపల్లి, ఆగస్టు 30 : సమాజంలో కులమతాల పేరుతో రాగద్వేషాలను పెంచుకోవద్దని సమానత్వా న్ని పాటించి మంచి సమాజంకోసం పాటుపడాలని ఆర్ఐ మద్దిలేటి అ న్నారు. మండలంలోని రామాపు రం గ్రామంలో సివిల్ రైట్స్‌డే సందర్భంగా తాసిల్దార్ అబ్రహం లింకన్ ఆదేశాల మేరకు సోమవారం ఆర్ఐ గ్రామంలో సమావేశం నిర్వహించి అంద రూ సోదరభావంతో మెలగాలని సూచించారు. కార్యక్రమంలో హెడ్‌కానిస్టేబుల్ రాజవర్ధన్ రెడ్డి, వార్డెన్ సుజాత, పంచాయతీ కార్యదర్శి కృష్ణయ్య, కిట్టు పాల్గొన్నారు.
అంతా కలిసిమెలిసి ఉన్నాం
మానవపాడు, ఆగస్టు 30 : గ్రామంలో ఎలాంటి విభేదాలు లేకుండా అంతా కలిసి మెలిసి ఉన్నామని గ్రామస్తులు అధికారులకు తెలిపారు. మండలంలోని చిన్నపోతులపాడు గ్రామ పంచాయతీ కార్యాలయంలో డిప్యూటీ తాసిల్దార్ రవికుమార్, సర్పంచు ఈశ్వరమ్మ ఆధ్వర్యంలో సోమవారం సివిల్ రైట్స్‌డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు గ్లాసుల పద్ధతి , దళితుల ఆలయం ప్రవేశం తదితర విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మా గ్రామంలో ఎలాంటి ఇబ్బందులు లేవని అందరం కలిసి మెలిసి ఉన్నామని తెలిపారు. కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ వెంకటయ్య, ఆర్ఐ రజినీకాంత్ రెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.