
ఆత్మకూరులో క్రేన్‌తో భారీ గజమాల వేసిన పార్టీశ్రేణులు
కార్యకర్తల ప్రేమకు దాసోహమన్న ఎమ్మెల్యే చిట్టెం
ఆత్మకూరు, జనవరి 30: మక్తల్ నియోజకవర్గం ‘అపర భగీరథుడు ఎమ్మెల్యే చిట్టెం రామ్మెహన్‌రెడ్డి’ జన్మదిన వేడుకలను ఆదివారం నియోజకవర్గమంతటా ఘనంగా నిర్వహించారు. ఆత్మకూరులోని ఆర్అండ్బీ అతిథిగృహ ప్రాంగణంలో నిర్వహించిన వేడుకల్లో పార్టీ శ్రేణులు, నాయకులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవికుమార్‌యాదవ్ నేతృత్వంలో జరిగిన వేడుకల్లో భారీ గజమాలను క్రేన్ సహాయంతో ఎమ్మెల్యేకు వేశారు. అనంతరం ఆంగ్ల అక్షరాలతో ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను ఎమ్మెల్యే దంపతులు కట్‌చేసి అభిమానులకు పంచిపెట్టారు. మండల నాయకులు ఎమ్మెల్యే దంపతులను సన్మానించారు. ఎమ్మెల్యే దంపతులు వేడుక ప్రాంగణానికి రాగానే కురిపించిన పూలవర్షం, పటాకుల మోత అందరినీ ఆకట్టుకున్నది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జీవితంలో కొన్ని మధురానుభూతులు ఎప్పటికీ మరిచిపోలేమని, ఆత్మకూరులో మీరు చూపించే ఆప్యాయత కూడా అలాంటిదేనన్నారు. దీనికి ఏమాత్రం తాను కూడా తగ్గేదేలేదని… వారి ప్రేమకు సర్వదా దాసోహమని పేర్కొన్నారు. కొవిడ్ నేపథ్యంలో అందరూ మాస్కులు ధరించి నిబంధనలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ బంగారు శ్రీనివాసులు, వైస్‌ఎంపీపీ కోటేశ్వర్, జెడ్పీటీసీ శివరంజని, పీఏసీసీఎస్ అధ్యక్షుడు కృష్ణమూర్తి, మున్సిపల్ చైర్పర్సన్ గాయత్రీయాదవ్, వైస్‌చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీధర్‌గౌడ్, నాయకులు వీరేశలింగం, లక్ష్మీనారాయణ, టీఆర్ఎస్ మండల ప్రతినిధులు, ఎంపీటీసీలు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, వివిధ వ్యాపార వర్గాల ప్రతినిధులు, యువజన సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
‘కార్యకర్తలు.. నా కుటుంబసభ్యులు’
అమరచింత, జనవరి 30: మక్తల్ నియోజకవర్గంలోని ప్రజలకు సేవ చేసుకునే అవకాశం కల్పించిన టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు తన కుటుంబసభ్యులతో సమానమని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మండలకేంద్రంలోని దశమికట్ట వద్ద టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటుచేసిన తన జన్మదిన వేడుకల్లో సతీమణి సుచరితమ్మతో కలిసి ఎమ్మెల్యే కేక్ కట్ చేసి అందరికి పంచిపెట్టి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజాసంఘాల నాయకులు పుట్టినరోజు శుభాక్షాంక్షలు తెలిపి ఎమ్మెల్యే దంపతులను పూలమాల, శాలువాతో సన్మానించారు. అనంతరం పట్టణంలోని పద్మశాలి ఫంక్షన్హాల్లో చేనేత కార్మికులు ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని కేక్ కట్‌చేసి కార్మికులు దేవరకొండ లచ్చన్న, పరుపల్లి చింతన్న, పరుపల్లి సత్యన్నను పూలమాల, శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మంగమ్మ, జెడ్పీటీసీ సరోజ, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, అమరచింత ఎత్తిపోతల సంఘం అధ్యక్షుడు రాజేందర్‌సింగ్, టీఆర్ఎస్వీ ఉమ్మడి జిల్లాల మాజీ అధ్యక్షుడు నరేశ్‌రెడ్డి, కౌన్సిలర్లు లెనిన్, లక్ష్మి, కోఆప్షన్ సభ్యులు షాహిన్ఫ్రీ, రాజేందర్, షాన్వాజ్ఖాన్, టీఆర్ఎస్ నాయకులు నాగభూషణంగౌడ్, రమేశ్, నర్సింహులుగౌడ్, రమేశ్, చిన్న బాలరాజు, రమేశ్, రవి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.