e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, January 17, 2022
Home జిల్లాలు పేదల అభ్యున్నతే లక్ష్యం

పేదల అభ్యున్నతే లక్ష్యం

దేవరకద్ర రూరల్‌, నవంబర్‌ 29 : పేదల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. సోమవారం దేవరకద్రలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ భవన ని ర్మాణ పనులను పరిశీలించారు. పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అనంతరం చిన్నచింతకుంట మండలం లాల్‌కోట గ్రామంలో గణపతి, శివలింగం, వీరభద్ర, కుమారస్వామి, వేంకటేశ్వరస్వామి, ఆంజనేయస్వామి, నవగ్రహ, బొడ్రాయి, పోచమ్మదేవత విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. గ్రామస్తులు కనులపండువగా దేవతా విగ్రహాల ప్రతిష్ఠాపన ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయన్నారు. ప్రతిఒక్కరూ భక్తిభావాన్ని అలవర్చుకొని సన్మార్గంలో పయనించాలని సూచించారు. అనంతరం చిన్నచింతకుంట, బండర్‌పల్లి, లాల్‌కోట, దాసర్‌పల్లి గ్రామాలకు చెందిన ఏడుగురికి సీఎం సహాయనిధి చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడే పేదలకు సీఎం సహాయనిధి నుం చి ఆర్థికసాయం మంజూరుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానన్నారు. ఆపత్కాలంలో సీఎం సహాయనిధి అందరికీ అండగా నిలుస్తున్నదన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రుణపడి ఉండాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ హర్షవర్ధన్‌రెడ్డి, జెడ్పీటీసీ రాజేశ్వరి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కోట రాము, ఏఎంసీ వైస్‌చైర్మన్‌ రమేశ్‌, సర్పంచ్‌ సంధ్యారత్నం పాల్గొన్నారు.
పార్టీలకతీతంగా సంక్షేమ ఫలాలు
భూత్పూర్‌, నవంబర్‌ 29 : పార్టీలకు అతీతంగా ప్రభుత్వం సంక్షేమ ఫలాలను అందిస్తున్నదని ఎమ్మె ల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. మండలంలోని వె ల్కిచర్లలో నారాయణ ప్రమాదవశాత్తు మృతి చెందగా, అతడి కుటుంబానికి మంజూరైన రూ.లక్ష ఎక్స్‌గ్రేషి యా చెక్కును సోమవారం ఎమ్మెల్యే అందజేశారు. అలాగే వెల్కిచర్లలో నెలరోజుల కిందట చంద్రయ్య పాముకాటుతో మృతి చెందగా, అతడి భార్య భౌరమ్మ కు రూ.5వేల ఆర్థికసాయం అందించారు. ప్రభుత్వపరంగా కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పాతమొల్గరలో అడ్వకేట్‌ గోపాల్‌రెడ్డి మృతి చెందగా, ఆయన పార్థివదేహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మున్సిపాలిటీకి చెంది న మల్లేశ్‌కు రూ.60వేలు, పెద్దరాములుకు రూ.60వేల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను అందించారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రతి ఇంటికీ అందుతున్నాయన్నారు. ము ఖ్యమంత్రి కేసీఆర్‌ హయాంలో పేదలను సీఎంఆర్‌ ఎఫ్‌తో అన్నివిధాలా ఆదుకుంటున్నట్లు తెలిపారు. కా ర్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ సత్తూర్‌ బస్వరాజ్‌గౌ డ్‌, ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్‌ అశోక్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ వైస్‌చైర్మన్‌ సత్తూర్‌ నారాయణగౌడ్‌, మాజీ ఎంపీపీ చంద్రశేఖర్‌గౌడ్‌, సత్యనారాయణ, సాయిలు, మురళీధర్‌గౌడ్‌, రామునాయక్‌, నా రాయణ, సుదర్శన్‌గౌడ్‌, నర్సింహులు, రవీందర్‌రెడ్డి, రాములు, బోరింగ్‌ నర్సింహులు, సూరి ఉన్నారు.
ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు
మూసాపేట, నవంబర్‌ 29 : మండలంలోని తి మ్మాపూర్‌ గ్రామస్తులు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామానికి బీటీరోడ్డు నిర్మించడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు లక్ష్మీనర్సింహయాదవ్‌, ఎంపీటీసీ సుకన్యాప్రవీణ్‌రెడ్డి, నాయకులు సాయిరెడ్డి, రవీందర్‌రెడ్డి, రెడ్డిరాజు, ఆంజనేయులు, లక్ష్మీనర్సిం హ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement