సురక్షితమైన, అవాంతరాలు లేని సేవలు
జిల్లాలో 8464 రిజిస్ట్రేషన్లు పూర్తి
మీడియాకు వెల్లడించిన కలెక్టర్ భవేశ్ మిశ్రా
జయశంకర్ భూపాలపల్లి, అక్టోబర్ 29( నమస్తేతెలంగాణ): సీఎం కేసీఆర్ దూర దృష్టితో సురక్షితమైన, అవాంతరాలు లేని ధరణి పోర్టల్ రూపొందించడం రైతులకు వరమని కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. ధరిణి పోర్టల్ ప్రారంభించి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా పోర్టల్ పోస్టర్‌ను శుక్రవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రెవెన్యూ పాలనలో ట్యాంపర్ ప్రూఫ్, విచక్షణ రహిత సేవలను అందించేందుకు సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్‌కు రూపకల్పన చేసినట్లు తెలిపారు. ఇది సురక్షితమైన, అవాంతరాలు లేని వినూత్నమైన ఆన్లైన్ పోర్టల్ అని తెలిపారు. జిల్లాలో ధరణి పోర్టల్‌ను విజయవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. భూముల సమస్యల పరిష్కారంలో రెవెన్యూ ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తు,ప్రజలకు సత్వర సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లాకు గతంలో ఒకే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ఉండడంతో ప్రజలు అనేక ఇబ్బందుకలు గురయ్యే వారని తెలిపారు. ప్రభుత్వం అందుబాటులోకి తీసుకు వచ్చిన ధరణి పోర్టల్ ద్వారా జిల్లాలో 11 మండలాల తహసీల్దార్ కేంద్రాల్లో 11 సబ్ రిజిస్ట్రేషన్ సెంటర్ల ద్వారా సేవలు అందుతున్నట్లు తెలిపారు.
ధరణి క్రియాత్మక లక్షణాలు
ప్రజలు వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మీ సేవ కేంద్రంలో అడ్వాన్స్ స్లాట్ బుకింగ్ చేసుకోవాటి. ప్రతి సర్వే నంబర్‌కు మార్కెట్ విలువ వివరాలను పొందు పర్చి, రిజిస్ట్రేషన్ కోసం చెల్లించే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల వివరాలను ఆన్లైన్లో లెక్కించుటతోపాటు ఆన్లైన్ చెల్లింపులు చేయవచ్చునని తెలిపారు. బయో మెట్రిక్ విదానం, మ్యూటేషన్‌తో కూడిన నమోదు, పోస్టల్ శాఖ ద్వారా ఇంటి అడ్రస్‌కు పాస్ బుక్ డెలివరీ చేస్తారని తెలిపారు.
జిల్లాలో 8464 రిజిస్ట్రేషన్లు
ధరణి పోర్టల్‌ను 2020 అక్టోబర్ 29న ప్రారంభించిన నుంచి 8464 రిజిస్ట్రేషన్లు, 8203 ఫిర్యాదులను పూర్తి చేసినట్లు తెలిపారు. అమ్మకానికి సంబంధించినవి 4656, బహుమతి రిజిస్ట్రేషన్లు 2138, వారసత్వ భూములకు సంబంధించినవి 600, తనఖా రూపంలో చేసిన రిజిస్రేషన్లు 1070 ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ కురాకుల స్వర్ణలత, ఆర్డీవో శ్రీనివాస్, జిల్లాలో అన్ని మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.