మండిపోతున్న ధరలు
ఆంధ్రాలో వర్షాల నేపథ్యంలో తగ్గిన దిగుబడులు
మంచిర్యాలటౌన్/భైంసా, నవంబర్ 27: కూరగాయల ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. కొండెక్కిన రేట్లతో జేబులో రెండొందలు పెట్టుకుని మార్కెట్కు వెళ్తే కనీ సం రెండు రోజులకు సరిపడా కూరగాయ లు కొనలేని పరిస్థితి దాపురించింది. ఇక ట మాట ధర మాత్రం చుక్కలనంటుతోం ది. రూ 30 నుంచి రూ.40 వద్ద నెలల తరబడి స్థిరంగా ఉన్న టమాట ధర ఇప్పుడు అ మాంతం రూ. 100 కు చేరుకుంది. రెం డు వారాల పాటు ఇదే ధర కొనసాగగా ఇ ప్పు డిప్పుడే కాస్త తగ్గుముఖం పట్టి రూ. 80 లకు దిగింది. ఆంధ్రా ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా టమాటతో పాటు ఇతర కూరగాయల తోటలు దెబ్బతినడంతోపాటు రవాణాకు ఆటంకాలు ఏర్పడడంతో ధరలు పెరిగినట్లు వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం సూచించన విధంగా రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గుచూపి స్థానికంగానే పెద్ద ఎత్తున కూరగాయలు పండిస్తే ధరలు అందుబాటు లో ఉండేవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ముథోల్ నియోజకవర్గంలో..
నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో కూరగాయలను కిలోకు రూ. 40 పైనే అమ్ముతున్నారు టమాట కిలో రూ. 80 నుంచి రూ. 110 వరకు ఉంది. బీరకా య, కాకర, చిక్కుడు, బీన్స్ తదితర కూరగాయలు కేజీ రూ. 60 నుంచి రూ. 100 మధ్య అమ్ముతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వంకాయ కిలో రూ. 50 నుంచి 60 వరకు , క్యాలీఫ్లవర్, క్యాబేజీ, క్యారెట్, క్యా ప్సికం కేజీకి రూ. 60 నుంచి 80 వరకు విక్రయిస్తున్నారు. ఉల్లిగడ్డ పాతవి కిలో రూ. 40 నుంచి రూ. 50 అమ్ముతుండగా కొత్తవి రూ. 30 పలుకుతున్నది.
కొనుగోళ్లు తగ్గాయి..
కూరగాయల ధరలు విపరీతంగా పెరగడంతో కొనుగోళ్లు తగ్గుముఖం పట్టాయి. టమాట కిలోకు రూ 100 చేరింది. దీంతో వినియోగదారులు గతంలో కిలో కొనుగోలు చేసిన వారు ఇప్పుడు అరకిలోనే కొంటున్నారు. ధరలు పెరగడంతో కొందరు వ్యాపారులను నిందిస్తున్నారు. కానీ మా చేతుల్లో ఏమీలేదు. ఏ రోజుకారోజు హోల్సేల్లో కూరగాయలు కొని దానిపై కొంత లాభం చూసుకొని అమ్ముకుంటాం.చిలువేరు రమేశ్, వ్యాపారి, మంచిర్యాల
కూరగాయలు కొనేటట్లు లేదు
పెరిగిన ధరలతో కూరగాయలు ఏం కొనేటట్లు లేదు. కిలో టమాట రూ. 100కు చేరుకోవడం దారుణం. ఈ సీజన్లో కూరగాయల ధరలు చాలా తక్కువగా ఉంటా యి. కానీ వాతావరణ పరిస్థితులతో అన్ని రకాల కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి.సామాన్య ప్రజలు కొనే పరిస్థితి లేకుండా పోతున్నది. ఆంధ్రానుంచి టమాట రావాలంటున్నారు. మన ప్రాంతంలో అన్ని కూరగాయలు పండిస్తే ఈ పరిస్థితులు రావు.జీ మధులత, మంచిర్యాల