ఎంపీ సంజయ్ చేసింది శూన్యం
ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ధ్వజం
టీఆర్ఎస్లోకి 25మంది కాంగ్రెస్ నేతలు
గులాబీ కండువాకప్పి ఆహ్వానం
వీణవంక, జూన్ 26: కులమతాల పేరిట ప్రజల మధ్య చిచ్చుపెట్టే బీజేపీని తరిమికొట్టాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి హుజూరాబాద్ వాసులకు పిలుపునిచ్చారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పేదల అభ్యున్నతికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుచాలని విజ్ఞప్తిచేశారు. అవినీతి నేత ఈటల రాజేందర్‌కు ఓటేస్తే తెలంగాణకు చేటేనని పేర్కొన్నారు. బండి సంజయ్ ఎంపీగా గెలిచి రెండేండ్లు దాటుతున్నా కరీంనగర్ ప్రజలకు చేసిందేమీలేదని మండిపడ్డారు. అభివృద్ధిని పక్కనబెట్టి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు. వీణవంక మండలం నర్సింగాపూర్‌లో నిర్వహించిన టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావుతో కలిసి హాజరై మాట్లాడారు. 20 ఏండ్లు ప్రజలను పట్టించుకోని ఈటల బీజేపీలో చేరి ఏం చేస్తాడని ప్రశ్నించారు. ఎదిగిన పక్షి గూడు ను వదిలిపోయినట్లు.. ఈటల టీఆర్ఎస్లో అన్ని పదవులు అనుభవించి బీజేపీలోకి వెళ్లడం అవకాశవాద రాజకీయాలకు నిదర్శనమన్నారు. మతతత్వ పార్టీని గెలిపిస్తే ఈ ప్రాంత అభివృద్ధికి విఘాతం కలుగుతుందని, పథకాలు నిలిచిపోయే ప్రమాదముందన్నారు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి గోదారి జలాలతో రైతుల పాదాలు కడిగిన టీఆర్ఎస్ను ఆదరించాలన్నారు. అనంతరం వీణవంకలో ఏర్పాటు చేసిన సమావేశం లో కొండపాకకు చెందిన 25మంది కాంగ్రెస్ కా ర్యకర్తలు టీఆర్ఎస్లో చేరగా, సుదర్శన్‌రెడ్డి గు లాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఎంపీపీ ముసిపట్ల రేణుకాతిరుపతిరెడ్డి, జడ్పీటీసీ మాడ వనమాల-సాధవరెడ్డి, ఏఎంసీ చైర్మన్ బాలకిషన్‌రావు, పీఏసీఎస్ చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి, ఎంపీటీసీ జడల పద్మలత-రమేశ్, గ్రామ శాఖ అధ్యక్షుడు పత్తి కొండాల్‌రెడ్డి, నేతలు గెల్లు మల్ల య్య, చిన్నాల అయిలయ్య, మ్యాక వీరయ్య, దాసారపు ప్రభాకర్, సమ్మిరెడ్డి పాల్గొన్నారు.