ఎమ్మెల్యే నోముల భగత్
ఉమ్మడి జిల్లా కబడ్డీ పోటీలు
హాలియా, జనవరి 26 : యువత క్రీడల్లో రాణించాలని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ సూచించారు. వేణుకుమార్ జ్ఞాపకార్థ్ధం హాలియాలో ఏర్పాటు చేసిన ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి ఇన్విటేషన్ కబడ్డీ పోటీలను మంగళవారం రాత్రి ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ నల్లగొండ సుధాకర్, కౌన్సిలర్ వర్రా వెంకట్‌రెడ్డి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు చెరుపల్లి ముత్యాలు, ప్రముఖ దంతవైద్య నిపుణుడు డాక్టర్ జలపాటి రాఘవేంద్ర, టీఆర్ఎస్ నాయకులు పంగ లక్ష్మణ్, పిల్లి వెంకట్‌యాదవ్, టైంస్కూల్ డైరెక్టర్ నరేందర్‌రెడ్డి, యడవల్లి రాంబాబు, రావులపాటిఎల్లయ్య పాల్గొన్నారు.
విజేతలకు బహుమతుల ప్రదానం
కట్టంగూర్(నకిరేకల్) : మండలంలోని పాలెం గ్రామంలో ఎన్ఎల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి క్రికెట్ పోటీల విజేతలకు ఎమ్మెల్యే నోముల భగత్, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొని బహుమతులు అందజేశారు. పాలెం సర్పంచ్ కవితావిజయ్, ఉప సర్పంచ్ మల్లారెడ్డి, నోముల గోవిందరాజు, నోముల మనోహర్, మాచర్ల స్వామి, నాగవెల్లి వెంకన్న,, నోముల తేజ్‌కుమార్, బల్ల పురుషోత్తం, సోముల సైదులు, బండారు రాజు, దూదిమెట్ల నరేశ్, నిర్వాహకులు పాల్గొన్నారు.