డీసీసీబీ పంట రుణాల లక్ష్యం
గత సీజన్కంటే అదనంగా రూ.141కోట్లు
కొత ్తపాస్బుక్లకు సైతం లోను
మంజూరు విషయంలో 18 బ్రాంచ్‌లకు స్పష్టమైన ఆదేశాలు
సుబేదారి, జూన్ 25 : ఈ వానకాలం సీజన్లో రైతులకు రూ.444కోట్ల పంట రుణాలు ఇవ్వాలని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు టార్గెట్‌గా పెట్టుకున్నది. ఉమ్మడి జిల్లాలోని 70 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో సభ్యులుగా ఉన్న రైతులకు లోన్లు ఇచ్చేలా తీర్మానించింది. ఇప్పటికే సొసైటీల్లోని 1,777 మంది అన్నదాతలకు రూ. 11కోట్ల 34లక్షల రుణాలు అందించింది. గత సీజన్ కంటే ఈ సారి రూ.141కోట్ల రుణాలు అదనంగా ఇవ్వాలని నిర్ణయించడంపై అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతున్నది.
ఈ వానకాలం సీజన్లో రైతులకు రూ.444కోట్ల పంట రుణాలు ఇవ్వాలని డీసీసీబీ లక్ష్యంగా పెట్టుకున్నది. ఇటీవల బ్యాంకు చైర్మన్ మార్నేని రవీందర్రావు అధ్యక్షతన బోర్డు మీటింగ్ నిర్వహించి బ్యాంకుకు సంబంధించిన 18 ఖాశల మేనేజర్లకు రుణాల మంజూరు విషయంలో స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. రాష్ట్ర స్థాయి టెక్నికల్ కమిటీ నిర్ణయం మేరకు రకాలను బట్టి పంటలకు రుణాలు ఇస్తున్నారు. కొన్ని బ్రాంచిలలో రుణాల మం జూరు ప్రక్రియ మొదలైంది. గత వానకాలం సీజన్లో రూ.303 కోట్లు రుణాలు ఇచ్చారు. కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టులతో ఉమ్మడి జిల్లాలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగడంతో కొత్తగా పట్టాదారు పాస్‌బుక్ పొందిన రైతులకు సైతం రుణాలివ్వాలని పాలకవర్గ సభ్యులు తీర్మానించారు. ఇందుకు గాను ఆదనంగా రూ.141 కోట్ల రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు. కమర్షియల్ బ్యాంకుల కంటే తక్కువ వడ్డీకే డీసీసీబీ ద్వారా రుణాలు అందుతుండడంతో చాలామంది రైతులు మొగ్గు చూపుతున్నారు.
దరఖాస్తు పెట్టుకున్న కొద్దిరోజుల్లోనే..
పంటరుణం కావాలని స్థానిక పీఏసీఎస్‌లో రైతు దరఖాస్తు పెట్టుకున్న కొద్ది రోజుల్లోనే సంఘం చైర్మన్, సీఈవో పరిశీలించి అర్హత ఉన్నవారికి లోన్లు ఇచ్చేలా సంబంధిత బ్రాంచ్ మేనేజర్‌కు జాబితా పంపిస్తున్నారు. బ్రాంచ్ అధికారులు దరఖాస్తులను పరిశీలించి ఆన్లైన్ ద్వారా రైతు ఖాతాలో పంట రుణం జమ చేస్తున్నారు. ఇలా రైతులకు డీసీసీబీ రుణాల మంజూరు సులభంగా మారింది. సీజన్ మొదలు కావడంతో ఇప్పటికే 70 సంఘాల్లోని 1777 మంది రైతులకు రూ.11కోట్ల34లక్షల రుణాలు అందాయి.
అర్హత ఉన్న ప్రతి రైతుకు రుణం
అర్హత ఉన్న ప్రతి రైతుకు డీసీసీబీ ద్వారా రుణం ఇస్తాం. ఈసారి రూ.444కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. గతంలో పంట రుణాల కోసం రైతులు చాలా ఇబ్బందులు పడేవాళ్లు. ఇప్పుడు అర్హత ఉన్న రైతులకు వెంటనే రుణం ఇచ్చేలా పీఏసీఎస్ చైర్మన్, సీఈఓలకు బాధ్యతలు అప్పగించాం. దరఖాస్తు చేసుకున్న మూడు నాలుగు రోజుల్లోనే డబ్బు జమ చేస్తున్నాం. ఈ సారి కొత్తపాస్బుక్లపైనా రుణాలిస్తున్నాం. మంజూరు ప్రక్రియ వేగవంతం కోసం కొత్త సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తెచ్చాం. – మార్నేని రవీందర్రావు, డీసీసీబీ చైర్మన్