
మట్టి రోడ్లు సీసీ రోడ్లుగా మార్పు
35 గ్రామాలకు నిధులు కేటాయింపు
రూ.2కోట్ల 99లక్షలు మంజూరు
హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు
త్వరలోనే పనులు ప్రారంభం
హన్వాడ, జనవరి 25 : మండలంలోని 35 గ్రామ పం చాయతీల్లో మట్టి రోడ్లను సీసీ రోడ్డుగా వేసేందుకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కృషితో రూ.2కోట్ల 99లక్షల నిధులు మం జూరు చేయడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎ న్నో ఏండ్ల నుంచి గ్రామాల్లో సీసీ రోడ్లు వేయాలని పాలకులకు విన్నవించిన పరిష్కరించే నాయకుడు కరువయ్యారు. వర్షకాలం వచ్చిందంటే చాలా ఇబ్బందులు ఎందుర్కొన్నామని ఆయా గ్రామాల ప్రజలు వాపోయారు. తమ కాలనీల్లో సీసీ రోడ్లు వే యాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన స్పందించి నిధులు మంజూరు చేశారని ప్రజాప్రతినిధులు పేర్కొన్నా రు. త్వరగా పనులు చేపట్టి పూర్తి చే యాలని ఆయా గ్రామాల ప్రజలు కో రుతున్నారు. హన్వాడకు రూ.15లక్ష లు, ఇబ్రహీంబాద్‌కు రూ.10లక్షలు, కి ష్టపల్లికి రూ.8లక్షలు, కొత్తపేటకు రూ. 10లక్షలు, కోనగట్టుపల్లికి రూ.10లక్షలు, గోండ్యాల కు రూ.12లక్షలు, గు డ్డి మల్కాపురానికి రూ.10లక్షలు, బుద్ధ్దారానికి రూ.10లక్షలు, దచ్చక్పల్లి కి రూ.8లక్షలు, వేపూర్‌కు రూ.15లక్ష లు, టంకరకు రూ.10లక్షలు, షేక్‌పల్లికి రూ.10లక్షలు, సల్లోనిపల్లికి రూ.10లక్షలు, రామన్నపల్లికి రూ.8లక్షలు, ము నిమోక్షాకు రూ.10లక్షలు, మాధారాని కి రూ.10లక్షలు, నాయినోనిపల్లికి రూ.10లక్షలు, పెద్దదర్పల్లికి రూ.10లక్షలు, ఎర్రగట్టుతండాకు రూ.8లక్షలు, ఎనమిదితండాకు రూ.8లక్షలు, ఎల్లబాయితండాకు రూ.8లక్షలు, యారోనిపల్లికి రూ.10లక్షలు, వెంకటమ్మ కుంట తండాకు రూ.5లక్షలు, తిరుమలగిరికి రూ.10లక్షలు, పుల్పోనిపల్లికి రూ.8లక్షలు, పల్లెమో నికాలనీకి రూ.8లక్షలు, నాగంబాయి తండాకు రూ.5 లక్షలు, లిగన్నపల్లికి రూ.8లక్షలు, కిష్టపల్లిగేటుతండాకు రూ.5లక్షలు, కారంతండాకు రూ.5లక్షలు, దోరితండాకు రూ.5లక్షలు, అయోధ్యనగర్‌కు రూ.5లక్షలు, అమ్మాపూరంతండాకు రూ.5లక్షలు, అత్యకుంటతండాకు రూ.5లక్ష లు, రాంనాయక్‌తండాకు 5లక్షలు మంజూరయ్యాయి. మ ంజూరైన నిధులతో పనులు త్వరలో ప్రారంభిస్తామన్నారు.
గత పాలకులు పట్టించుకోలేదు
ఆయా కాలనీలకు వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు ఎందుర్కొన్నాం. సీసీ రోడ్లు వేయించాలని ఎన్నోసార్లు గత ప్రభుత్వానికి చెప్పినా పట్టించుకోలేదు. రోడ్డుపైన నడవడానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సీసీ రోడ్లకు నిధులు మంజూరు చేయడం ఎంతో సంతోషం. వెంటనే పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తాం. ప్రజలు పని చేసే ప్రభుత్వానికి రుణపడి ఉండాలి.