పెబ్బేరురూరల్, నవంబర్ 22 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న బృహత్ పల్లెప్రకృతి వనాలను సత్వరమే పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. సోమవారం ఆయన పెబ్బేరు మండలం అయ్యవారిపల్లె, యాపర్ల, శాఖాపురం, తోమాలపల్లె గ్రామాల్లో పర్యటించారు. ప్రకృతి వనాలను ఏర్పాటు చేయబోయే పదెకరాల చొప్పున స్థలాలను పరిశీలించారు. అయ్యవారిపల్లె గ్రామానికి పదెకరాలకు తోడు మరో ఐదు ఎకరాల్లో ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీవో నర్సింహులు, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.
మొక్కలను సంరక్షించాలి జెడ్పీ సీఈవో వెంకట్‌రెడ్డి
ఖిల్లాఘణపురం, నవంబర్ 22 : బృహత్ పల్లెప్రకృతి వనంలో మొక్కలను పెంచి పెద్దవిగా చేయాలని జెడ్పీ సీఈవో వెంకట్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంతోపాటు మండలంలోని సల్కలాపూ ర్, తిరుమలాయపల్లి గ్రామాల్లో ప్రారంభించిన బృహత్ పల్లెప్రకృతి వనం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామాల్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు పల్లెప్రకృతి వనాలను ఏర్పా టు చేసిందన్నారు. పది ఎకరాల స్థలంలో బృహత్ పల్లెప్రకృతి వనాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందని, ప్రకృతి వనాల్లో మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. అదేవిధంగా హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించాలని, ప్రతి మొక్కకు ట్రీగార్డ్ ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈ కబీర్దాస్, ఎంపీవో, ఏపీవో, సర్పంచ్ వెంకటరమణ, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.