మంచాల నవంబర్ 21 : హరితహారంతో పల్లెలు, ప్రభుత్వ పాఠశాలలు పచ్చని చెట్లతో కనువిందు చేస్తున్నాయి. ఖాళీ ప్రదేశాలు, రోడ్లకిరువైపులా ప్రభుత్వ పాఠశాలలో విరివిగా పూలు, పండ్లు, నీడనిచ్చే మొక్కలు నాటి సంరక్షింస్తుడండంతో ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. మంచాల మండలంలోని జాపాల, రంగాపూర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి నాటిన మొక్కలు వృక్షాలుగా మారి కనువిందు చేస్తున్నాయి. పాఠశాలో ఆవరణ పచ్చని చెట్లతో హరిత శోభను సంతరించుకున్నది. ప్రతి రోజూ సాయంత్రం ఉపాధ్యాయులు, విద్యార్థులు కలుపు మొక్కలను తొలగించడమే కాకుండా క్రమం తప్పకుండా నీరును అందిస్తున్నారు.
కార్యాలయాల్లో ‘హరిత’ ఫలాలు
శంకర్పల్లి, నవంబర్ 21 : ఆనేండ్ల కింద శంకర్పల్లి మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో హరితహారంలో నాటిన మొక్కలు నేడు ఏపుగా పెరిగి చెట్లుగా మారాయి. ప్రతి రోజూ ఎంపీడీవో, తహసీల్దార్ కార్యాలయాలకు పనుల నిమిత్తం వచ్చే ప్రజలకు అవి నీడనిస్తున్నాయి. అధికారులు, సిబ్బంది చొరవతో వివిధ రకాల మొక్కలు ఏపుగా పెరిగాయి. ఎంపీడీవో కార్యాలయం ఎదురుగా సుమారు పది గుంటల భూమిలో పల్లె ప్రకృతి వనం తరహాలో మొక్కలు నాటారు. అవి ఏపుగా పెరిగి కార్యాలయానికి కొత్త శోభను తీసుకొచ్చాయి. 20 ఏండ్ల కింద శంకర్‌పల్లిలో తహసీల్దార్‌గా విధులు నిర్వహించిన మోహన్‌రావు కార్యాలయం ఎదుట త్రిఫల మొక్క లు నాటగా అవి వృక్షాలు మారి ఎందరికో నీడనిస్తున్నాయి. తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో నాడు ఆయన వేప, రావి, మేడి త్రిఫల మొక్కలను నాటారు.