
రాయపోల్, నవంబర్ 21 : పేదలకు ఎల్లప్పు డు అండగా ఉంటానని, ప్రాణమున్నంత వరకు ప్రజలకు సేవ చేస్తానని ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్ అన్నారు. మండంలోని మంతూర్‌లో కనక లక్ష్మి ఇటీవల మృతి చెందారు. ఈ మేరకు ఆదివా రం మృతురాలి కుటుంబాన్ని ఎమ్మెల్సీ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు 20 ఏండ్ల నుంచి దుబ్బాక నియోజకవర్గ ప్రజలతో అనుబంధం ఉందన్నారు. ప్రజల సహకారం తాను మరు వలేనని, వారి ఏ ఆపద వచ్చినా అండగా ఉంటానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. ప్రతిపక్షాలకు ప్రజల విశ్వాసం కోల్పోయాయన్నారు. ఎమ్మెల్సీ వెంట టీఆర్ఎస్ నాయకులు చింతకింది మంజూర్ తదితరులు ఉన్నారు.
వివాహ వేడుకులకు హాజరైన ఎమ్మెల్సీ
టీఆర్ఎస్ సోషల్ మీడియా రాయపోల్ మండల అధ్యక్షుడు తిరుపతి కిషన్ వివాహం మండలకేంద్రంలోని జీఎల్ఆర్ ఫంక్షన్ హాల్లో జరిగింది. వివాహానికి ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్, టీఆర్ఎస్ యువజన నాయకుడు సోలిపేట సతీశ్‌రెడ్డి, నాయకులు మామడి మోహన్‌రెడ్డి, జడ్పీటీసీ యాదగిరి, ఏఎంసీ చైర్మన్ పడకంటి శ్రీనివాస్గుప్త్తా, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నర్సింహరెడ్డి, టీఆర్ఎస్ రాయపోల్, దౌల్తాబాద్ మండలాల అధ్యక్షులు వెంకటేశ్వరశర్మ, శ్రీనివాస్‌గౌడ్, వైస్ ఎంపీపీ రాజిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రవీందర్‌గౌడ్, వివిధ గ్రామాల ప్రజాప్ర తినిధులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
పుస్త్తె్తమెట్టెలు అందజేసిన ఎంపీపీ
మర్కూక్, నవంబర్ 21 : మండలంలోని పాములపర్తికి చెందిన వధువు వివాహానికి ఎంపీపీ పాండుగౌడ్ పుస్తెమెట్టెలు అందజేశారు. ఆయన వెంట నాయకులు మహేశ్, బీరయ్య, యాదయ్య, బాలయ్య ఉన్నారు.
బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం : రాంరెడ్డి
తొగుట, నవంబర్ 21 : మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి తెలి పారు. మండలంలోని వెంకట్రావుపేటలో అనారోగ్యం తో మరణించిన బెజ్జనమైన (తేళ్ల) కనకవ్వ (51) కుటుంబాన్ని ఎంపీటీసీల ఫో రం మండలాధ్యక్షులు కంకణాల నర్సింహులుతో కలిసి పరామర్శించి, ఆర్థికసా యం అందజేశారు. ముందుగా వెంకట్రావుపేటకు చెందిన వీరారెడ్డిపల్లి లక్ష్మి(50) కుటుంబాన్ని పరామర్శించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జీడిపల్లి అంజ మ్మప్రతాప్రెడ్డి, నాయకులు పిట్ల వెంకటయ్య, ఓలపు నారాయణ, బెజ్జనమైన రవి, స్వామి, ప్రవీణ్, లక్ష్మణ్ ఉన్నారు.