e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home జిల్లాలు ఈటల, వివేక్‌..దొందూ దొందే..

ఈటల, వివేక్‌..దొందూ దొందే..

ఈటల, వివేక్‌..దొందూ దొందే..

పౌర హక్కుల సంఘం మాజీ నేత, టీఆర్‌ఎస్‌ నాయకుడు దగ్గుల శంకర్‌

పెద్దపల్లి టౌన్‌, జూన్‌ 21: బడుగు, బలహీన వర్గాల నాయకులం తామంటూ బీజేపీలో తిరుగుతున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్‌, పెద్దపల్లి మా జీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి ఇద్దరూ బడుగు, బలహీన వర్గాలకు ద్రోహం చేశారని, దొం దూ.. దొందే అని పౌరహక్కుల సంఘం మాజీ నేత, టీఆర్‌ఎస్‌ నాయకులు దగ్గుల శంకర్‌ ధ్వజమెత్తారు. సోమవారం పెద్దపల్లిలో విలేకరులతో మాట్లాడారు. ఓట్లు వేసి గెలిపించిన తర్వాత తమ అవసరాలు తీర్చాలని ప్రజ లు వారి దగ్గరికి వెళ్తే కాళ్లు ముందు పెట్టి మొక్కించుకున్న చరిత్ర కేంద్ర మాజీ మంత్రి వెంకటస్వామి, మాజీ ఎంపీ వివేక్‌ది అని ఆరోపించారు. అదే సీఎం కేసీఆర్‌ ఎన్నడూ అలాంటి పనులు చేయలేదని, గురువులు, వేద పండితుల పాదాలను తాకి ఆశీర్వాదాలు తీసుకున్న గొప్ప మహానుభావుడని కొనియాడారు. అలాంటి వ్యక్తిని విమర్శించే నైతిక హక్కు వివేక్‌, ఈటల రాజేందర్‌కు లేదన్నారు. ఎనిమిదేళ్ల పాటు కేసీఆర్‌ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసి.. కూర్చున్న కొమ్మనే నరుక్కునే కుట్రలకు దిగిన నమ్మకద్రోహి ఈటల రాజేందర్‌ అని మండిపడ్డారు. తాను ఆర్‌ఎస్‌యూ రాడికల్‌ పీపుల్స్‌ వార్‌ మావోయిస్టు సానుభూతి పరుడిని అని చెప్పుకునే ఈటల పేదల భూములు ఎందుకు కబ్జా చేశారో? సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. బీసీల నాయకుడినని చెప్పుకునే ఈటల తన బిడ్డలకు ఓసీల ఇంటి పేర్లను ఎందుకు తగిలించాడో జవాబు ఇవ్వాలన్నారు. అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్న వివేక్‌ వెంకటస్వామికి ప్రజలు ఎలాంటి గుణపాఠం చెప్పారో? హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఈటల రాజేందర్‌కు ఈ ఉప ఎన్నికలో చెంప చెల్లుమనేలా ఓట్లతో సమాధానం ఇస్తారని పేర్కొన్నారు. కేసీఆర్‌ రాష్ట్రంలోని ప్రజలందరి అవసరాలను గుర్తించి వారికి ప్రభుత్వ పరంగా ప్రయోజనం కలిగేలా పాలనను అందిస్తున్నారని కొనియాడారు. హుజూరాబాద్‌ నియోజకవర్గ ప్రజలు రాజకీయ మోసగాళ్ల భరతం పట్టాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఈటల, వివేక్‌..దొందూ దొందే..
ఈటల, వివేక్‌..దొందూ దొందే..
ఈటల, వివేక్‌..దొందూ దొందే..

ట్రెండింగ్‌

Advertisement