-ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్
కడ్తాల్, నవంబర్ 20 : పోడు భూముల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. పోడు భూముల సమస్యపై శనివారం కడ్తాల్ మండలానికి చెందిన 60 గిరిజన కుటుంబాలు జడ్పీటీసీ దశరథ్‌నాయక్ ఆధ్వర్యంలో, హైదరాబాద్‌లో ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ను కలిసి వినతపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ మండలంలో దాదాపు 150 ఎకరాల పోడు భూములను నలభై ఏండ్ల నుంచి గిరిజన కుటుంబాలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయని తెలిపారు. వారికి పట్టాలు ఇప్పించేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యేను కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ పోడు భూములకు సంబంధించిన సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. నియోజకవర్గంలోని పోడు భూముల వివరాలు అధికారులు సేకరిస్తున్నారని, ప్రభుత్వానికి నివేదిక అందజేసి త్వరలోనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే వివరించారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్‌గుప్తా, కొండ్రిగానిబోడు తండా సర్పంచ్‌లు హరిచంద్‌నాయక్, సేవ్యాబావోజీ పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. మండల కేంద్రానికి చెందిన జనార్దన్గుప్తాకు రూ.2 లక్షలు, వీరమణికి రూ. లక్ష, మాడ్గుల్ మండలం కొర్రతండాకు చెందిన బిచ్చికి రూ.1,50,000లు సీఎంఆర్ఎఫ్ నుంచి చెక్కులు మంజూరయ్యాయి. శనివారం హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. లబ్ధిదారులకు స్థానిక నాయకులతో కలిసి సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరంలా మారిందని తెలిపారు. ఈ పథకంతో పేదలు కార్పొరేట్ దవాఖానల్లో వైద్య సేవలు పొందుతున్నారని పేర్కొన్నారు. పేదల ఆరోగ్యానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ దశరథ్‌నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్‌గుప్తా, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్‌లు రమేశ్‌రెడ్డి, హరిచంద్‌నాయక్, ఈశ్వర్‌నాయక్, ఉప సర్పంచ్ సంతోష్‌నాయక్, ఆర్యవైశ్య సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నారాయణగుప్తా, మండల గౌరవాధ్యక్షుడు గంప శ్రీను, యువజన సంఘం అధ్యక్షుడు వీరేంద్రగుప్తా, ప్రధాన కార్యదర్శి శరత్గుప్తా, నాయకులు సేవ్యానాయక్ పాల్గొన్నారు.