
స్వయం ఉపాధితో యువతకు స్ఫూర్తి
నెలకు రూ.30 వేలకు పైగా ఆదాయం
ఆదర్శంగా నిలుస్తున్న పాల ప్యాపారి
రామాయంపేట రూరల్, నవంబర్ 16 : ఇంటర్మీడియెట్ వరకు చదువుకున్నా.. ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రాలేదు. దీంతో నిరూత్సాహం చెందలేదు.. చివరకు వ్యాపారం చేయాలనే ఆలోచనతో పాల వ్యాపారం మొదలు పెట్టాడు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగానికి దీటుగా నెలకు రూ.30వేల వరకు ఆదాయం పొం దుతున్నాడు… రామాయంపేట మండలం దామరచెర్వు గ్రామానికి చెందిన మధునాల స్వామిగౌడ్. 15 ఏండ్ల నుంచి స్వామిగౌడ్ పాల వ్యాపారం చేస్తున్నాడు. గ్రామంలో సుమారు 50 మంది రైతుల నుంచి సుమారు 100 – 160 లీటర్ల వరకు పాలు సేకరిస్తున్నాడు. వెన్నశాతం ఆధారంగా కొనుగోలు చేసి న పాలను రామాయంపేట పట్టణంలోని స్వీట్హౌస్లు, హోటళ్లు, రోజూవారీగా తీసుకునే కుటుంబాలకు అమ్ముతున్నాడు. ప్రస్తుతం మార్కెట్లో లీటరు పాల ధర రూ.50 నుంచి రూ.60 వరకు ఉంది. పట్టణ ప్రజలు ప్యాకెట్ పాల కంటే రైతులు తెచ్చే పాలనే ఎక్కువగా తీసుకుంటున్నారు. సేకరించిన పాలను ఒక్కో లీటరపై సుమారు రూ.10 ఎక్కువ ధరకు అమ్మి నెలకు రూ.30 వేలకు పైగానే సంపాధిస్తున్నాడు. యువత స్వయం ఉపాధి అవకాశాలు ఎంచుకుంటే నిరుద్యోగ సమస్య ఉండదని స్వామిగౌడ్ పేర్కొన్నారు .
నేను చేస్తున్న పాల వ్యాపారం ప్రభుత్వ ఉద్యో గం కంటే లాభదాయకంగా ఉంది. ప్రతిరోజూ ఉదయం 5 నుంచి 10 గంటల వరకు పని ఉంటుంది. ఈ సమయంలో కష్టపడితే చాలు. స్వయం ఉపాధి మార్గాలు అనేకం ఉన్నాయి. యువకులు వాటిపై దృష్టి పెట్టాలి. చదువుకున్నవారు ఉద్యోగాల కోసం సమయం వృథా చేసుకోకుండా ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధి పథకాలు వినియోగించుకోవాలి