
ఉమ్మడి జిల్లాలోని సాగు పనులకు కూలీలు
కర్ణాటక, ఏపీ, ఒడిశా, చత్తీస్‌గఢ్, బెంగాల్ నుంచి రాక
రైస్‌మిల్లుల్లో బీహార్ వాసులు
స్థానిక పనులతో ఉపాధి పొందుతున్న పలువురు
వలసవాదులను ఆదుకుంటున్న పాలమూరు
మహబూబ్‌నగ ర్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి పాలమూరు గతంలో వలసలకు కేరాఫ్‌గా పేరొందింది. దేశ, విదేశాల్లో ఎక్కడ చూసినా ఇక్కడి లేబరే కనబడేవారు. గ్రామాల్లో బతుకుదెరువు కరువై పొట్ట చేతపట్టుకొని పిల్లాపాపలతో తరలివెళ్లేవారు. నేడు సీన్ రివర్స్ అయింది. స్వరాష్ట్రం ఆవిర్భావం తర్వాత ఏర్పడిన పరిస్థితులు, వ్యవసాయానికి ప్రభుత్వం పెద్దపీట వేయడంతో పరిస్థితులు మారాయి. ప్రాజెక్టులు, ఎత్తిపోతలకు తోడు నిరంతర విద్యుత్ సరఫరాతో సాగునీరు పుష్కలమైంది. దీంతో వలసలు వాపస్ వచ్చాయి. సొంత ఊళ్లల్లోనే వ్యవసాయం పండుగలా చేస్తూ సిరుల పంటలు పండిస్తున్నారు. అయితే పొలం పనులకు కూలీల కొరత ఏర్పడగా ఇతర రాష్ర్టాల నుంచి ఇక్కడికి పనులు చేసేందుకు వస్తున్నారు. కర్ణాటక, ఏపీ, చత్తీస్‌గఢ్, ఒడిశా, బెంగాల్ నుంచి పలువురు వలసొచ్చారు. జోగుళాంబ గద్వాల జిల్లాకు 10 వేల మంది, నారాయణపేట జిల్లాకు 9 వేలు, వనపర్తి జిల్లాకు 8 వేలు, మహబూబ్‌నగర్ జిల్లాకు 4 వేలు, నాగర్ కర్నూల్ జిల్లాకు 5 వేల మంది వలస వచ్చి ఉపాధి పొందుతారని అధికారుల అంచనా.
పాలమూరు అంటేనే గతంలో వలసల జిల్లాగా పేరుండేది. దశాబ్దాలు గా ఉన్న వలసలకు ప్రఖ్యాతి అ న్నట్లుగా ఉన్న పాలమూరుకు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ పేరు చెరిపివేయబడింది. ప్రాజెక్టుల ఆయకట్టు పెంచుకోవడంతోపాటు పెండింగ్‌ను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చడంతో బీడు భూముల్లో బంగారు పంటలు పండుతున్నాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో 18 లక్షల ఎకరాల సాగు భూములు ఉండగా.. ఈ ఏడాది 16 లక్షల ఎకరాల్లో సాగవుతున్నది. ప్రాజెక్టుల పరిధిలోనే సుమారు 10 లక్షల ఎకరాల ఆయకట్టు ఏర్పడింది. వరి సాగు ఊహించని స్థాయికి చేరుకున్నది. సుమారు 6 లక్షల ఎకరాల్లో వరి సాగవుతున్నది. కంది, పత్తి, జొన్న, ఆముదం, శనగ లు, పొద్దుతిరుగుడు, మినుములు ఇంతర పంటల సాగు సంబురంగా సాగుతున్నది. దీంతో ఒకప్పు డు వలసలు వెళ్లిన పాలమూరు వాసులు తిరిగి రా వడమే కాకుండా కూలీల కొరత ఏర్పడి ఇతర రా ష్ర్టాల నుంచి వ్యవసాయ కూలీలను పిలిపించాల్సి వస్తున్నది. రివర్స్ మైగ్రేషన్ పూర్తయి ఇతర రాష్ర్టాల కూలీలకు సైతం ఉపాధినిచ్చే స్థాయికి పాలమూరు ఎదిగింది. ఉమ్మడి జిల్లాకు సరిహద్దు రాష్ర్టాలైన ఏపీ, కర్ణాటక నుంచే కాకుండా చత్తీస్‌గఢ్, ఒడిశా, బెంగాల్ రాష్ర్టాల నుంచి కూడా వలస కూలీలు వ స్తున్నారు. పత్తి, మిర్చి ఏరేందుకు, సీడ్ పత్తి క్రా సింగ్ (ఫలదీకరణ) చేసేందుకు, వరి నాట్లు వేసేందుకు, చెరుకు కోతకు వలస కూలీలు వస్తున్నారు. సీజన్లో పని చేసుకొని తిరిగి వారి ప్రాంతానికి వెళ్లిపోతారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో సీడ్ పత్తి క్రాసింగ్ చేసేందుకు ఏపీలోని కర్నూల్, ప్రకాశం, కర్ణాటకలోని రాయిచూరు జిల్లాల నుంచి వలస కూలీలు వస్తున్నారు.
కర్నూల్ జిల్లా పరిధిలోని ఆ దోని, ఎమ్మిగనూరు, రాయిచూరు జిల్లాలోని వివి ధ గ్రామాల నుంచి ఉదయమే రైళ్లలో నారాయణపేట జిల్లా కృష్ణా రైల్వేస్టేషన్‌కు వచ్చి వ్యవసాయ ప నులు చూసుకొని సాయంత్రం తిరిగి వారి ఊళ్లకు వెళ్తున్నారు. నారాయణపేట జిల్లాలోని కృష్ణా మం డలం ఆలంపల్లి, చేగుంట గ్రామాల్లో పత్తి ఏరేందు కు కర్నూల్ జిల్లా మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోస్గి మండలాల నుంచి సుమారు 500 మంది వలస కూలీలు వస్తుంటారు. ప్రస్తుతం వర్షాల ప్ర భావంతో మరో రెండు రోజులయ్యాక పత్తి ఏరుతామని వారు తెలిపారు. నారాయణపేట జిల్లాకు సు మారు 9 వేలు, వనపర్తి జిల్లాకు 8 వేలు, మహబూబ్‌నగర్ జిల్లాకు 4 వేలు, నాగర్‌కర్నూల్ జిల్లా కు 5 వేల మంది వరకు వలస వస్తుంటారు. ఉమ్మ డి జిల్లా పరిధిలో సుమారు 36 వేల మంది వరకు వలస వచ్చి ఉపాధి పొందుతున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. వీరిలో సింహ భాగం ఏపీ, కర్ణాటక వారే. వనపర్తి జిల్లా అమరచింత, ఆత్మకూరులో కృష్ణవేణి షుగర్స్ ఆధ్వర్యం లో అగ్రిమెంట్ మీద చెరుకు పండిస్తారు. సుమారు 5 వేల ఎకరాల్లో చెరుకు సాగవుతుంది. ప్రస్తుతం ప్రకాశం జిల్లాకు చెందిన 600 మంది, మహారాష్ట్రకు చెందిన 100 మంది వ్యవసాయ కూలీలు ప నిచేస్తున్నారు. ఏపీ, కర్ణాటకలో పనులు లేని సమయంలో తెలంగాణలో పనిచేస్తామని పలువురు కూలీలు తెలిపారు. ఇక వరి నాట్ల సమయంలో ఏపీ, కర్ణాటకతో పాటు ఒడిశా, చత్తీస్‌గఢ్, బెంగా ల్ నుంచి వలస కూలీలు వస్తారు. పలువురు ఏజెం ట్లు కూలీలను తీసుకువస్తారు. పనులున్నన్ని రో జులు గుత్తలు (అగ్రిమెంట్) తీసుకుంటారు. కష్టపడి పనిచేసి రోజుకు రూ.700 నుంచి రూ.1000 వరకు కూడా సంపాదిస్తారు. స్థానికంగా కూలీల కొరత కారణంగా ఇతర రాష్ర్టాల వారిని పిలిపించా ల్సి వస్తున్నదని ఇక్కడి రైతులు చెబుతున్నారు.
గ్రామ సభలు నిర్వహిస్తాం..
జిల్లాలో పోడు భూముల కోసం 10వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. వీటిని ప్రభుత్వానికి నివేదించాం. ప్రభుత్వం ఆదేశంతో కలెక్టర్ ఆధ్వర్యంలో త్వరలో గ్రామ సభలు నిర్వహిస్తాం. ఆర్ఓఎఫ్ఆర్ నిబంధనల ప్రకారం అటవీ హక్కు పత్రాలు కల్పించేలా చర్యలు తీసుకుంటాం.