
పాన్‌గల్, నవంబర్ 20 : బాల్యవివాహాలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని డీసీసీబీ డైరెక్టర్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి, ట్రైనీ ఎస్సై హరీశ్ అన్నారు. ఎస్వీకే, చైల్డ్‌లైన్ 1098 ఆధ్వర్యంలో శనివారం మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో బాల్య వివాహల నిర్మూలన, బాలల హక్కులపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వారు ముఖ్య అతిథులు హాజరై ప్రసంగించారు. బాల్య వివాహాల నిషేధ చట్టప్రకారం అమ్మాయికి 18 సంవత్సరాలు, అబ్బాయికి 21సంవత్సరాలు నిండి ఉండాలని తెలిపారు. సమావేశంలో తిరుపతయ్య, పాఠశాలల హెచ్ఎంలు అరవింద్ప్రకాశ్, మంజుల, ఎస్వీకే ప్రాజెక్టు కోఆర్డినేటర్ జనార్దన్, అశోక్, అలివేల పాల్గొన్నారు.
బాలల హక్కులను కాపాడుదాం
రేవల్లి, నవంబర్ 20 : బాలబాలికల హక్కులను కాపాడేందుకు ప్రతిఒక్కరూ సంసిద్ధం కావాలని ఎస్సై శ్రీనివాసులు అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చైల్డ్‌లైన్ ఆధ్వర్యంలో చైల్డ్‌లైన్ సే దోస్తి కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్యవివాహాల నిర్మూలనకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలని ఆయన కోరారు. అనంతరం వాల్‌పోస్టర్లను విద్యార్థులకు పంపిణీ చేసి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో తాసిల్దార్ శ్రీరాములు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవీంద్రాచారి, ఉపాధ్యాయులు ఎండీ సలీం, ఐసీడీఎస్ సూపర్వేజర్ అరుణ, మెడికల్ ఆఫీసర్ రేణుక, చైల్డ్‌లైన్ మండల ఇన్చార్జి అశోక్, అంగన్వాడీలు అరుణ, లోకమాత పాల్గొన్నారు.