మెదక్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): సాధారణ ఎన్నికలు 2023 మెదక్, నర్సాపూర్ శాసనసభ నియోజకవర్గాల్లో నామినేషన్ వేసిన అభ్యర్థుల వివరాలను జిల్లా ఎన్నికల అధికారి రాజర్షి షా వివరించారు. మెదక్ నియోజకవర్గంలో మొత్తం 18 నామినేషన్లు దాఖలయ్యాయని, అందులో ఒకటి తిరస్కరణకు గురైందని, మిగతా 17 నామినేషన్లు ఆమోదం పొందాయన్నారు.
ఆఫిడవిట్ అసంపూర్తిగా ఉన్నందున ఒక నామినేషన్ తిరస్కరించబడిందని తెలిపారు. నర్సాపూర్లోని ఆర్వో కార్యాలయంలో నామినేషన్ల స్క్రూటీనిని జిల్లా ఎన్నికల పరిశీలకుడు పృథ్వీరాజ్ పరిశీలించారు. నర్సాపూర్ నియోజవర్గంలో మొత్తం 16 మంది నామినేషన్ వేశారు. అందులో 16 మంది అభ్యర్థులవి ఓకే అయ్యాయి.