కేటీదొడ్డి, నవంబర్ 15 : మండలంలోని నందిన్నెలో మహిళ శిశు సంక్షేమ శాఖ, కమిట్మెంట్స్ సంస్థ ఆధ్వర్యంలో చైల్డ్‌లైన్ వారు సో మవారం బాలల దినోత్సవం సంబురాలు నిర్వహించారు. నెహ్రూ జయంతిని పురస్కరించుకొ ని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. చైల్డ్‌లైన్ 1098 నంబర్‌పై, బా ల్యవివాహాలు, బాల కార్మికులు నిర్మూలన తదితర బాలల హక్కులపై అవగాహన కల్గించారు. అనంతరం విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, డ్రాయింగ్ పోటీలు, మ్యూజికల్ చైర్స్ తదితర పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో చైల్డ్‌లై న్ కౌన్సిలర్ లత, టీం మెంబర్ లక్ష్మి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మహేశ్, ఉపాధ్యాయు లు తదితరులు పాల్గొన్నారు.
బాల్యవివాహాలపై…
మల్దకల్, నవంబర్ 15 : మండలంలోని విఠలాపు రం జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో బాల్యవివాహాలపై సోమవారం విద్యార్థులకు చైల్డ్‌లైన్, 1098 ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ ఆడపిల్లల రక్షణ, వివక్ష, బాల్యవివాహాలపై వివరించారు. బాల్యవివాహాల వల్ల నష్టాలు, సెల్ ఫోన్ వల్ల అనర్థాలు, శారీరక ఎదుగుదల్లో మార్పులు, వ్యక్తిగత ప రిశుభ్రతతోపాటు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. పాఠశాలకు వెళ్లకుండా ఎవరైనా ఉంటే వెంటనే 1098కు ఫోన్ చేయాలన్నారు. కార్యక్రమంలో కమిట్మెంట్స్, చైల్డ్‌లైన్ టీం సభ్యులు, ఉపాధ్యాయు లు, విద్యార్థులు పాల్గొన్నారు.
కస్తూర్బా పాఠశాలలో…
మానవపాడు, నవంబర్ 15 : బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సో మవారం మండలకేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో వేడుకలను నిర్వహించారు. విద్యార్థులు జాతీయ నాయకుల వివిధ వేషధారణలతో బా లల దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమం లో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.