గద్వాల, నవంబర్ 15 : స్థానిక సంస్థలకు సంబంధించి న శాసన మండలి 9 నియోజకవర్గ ఎన్నికలకు మంగళవా రం నోటిఫికేషన్ విడుదల అవుతున్నదని అదనపు కలెక్టర్ రఘురాం శర్మ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశం హాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధు లు, ఎంపీడీవోలు, తాసిల్దార్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ లో ఉన్న 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు భారత ఎన్నిక ల సంఘం షెడ్యూల్ విడుదల చే సిందని పేర్కొన్నారు. ఈనెల 16 నుంచి 23వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 24న పరిశీలన, 26 న ఉపసంహరణ గడువు ముగుస్తుందని ఆయన చెప్పారు. వచ్చే నెల 10న ఉదయం 8 నుంచి సా యంత్రం 4 గంటల వరకు పో లింగ్ జిల్లా పరిషత్ సమావేశ హా ల్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నా రు. డిసెంబర్ 14న కౌంటింగ్ బా లుర జూనియర్ కళాశాల మహబూబ్నగర్లో నిర్వహిస్తామన్నా రు. జిల్లా ప్రాదేశిక సభ్యులు, మండల ప్రాదేశిక సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు 232 మంది ఓటర్ల జాబితాను విడుదల చేశామన్నారు.
ఈనెల 23న తుది జాబితా ప్రకటిస్తామన్నారు. జిల్లాలో పకడ్బందీగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. రాజకీయ పార్టీలు బైక్ ర్యాలీలు, సమావేశాలు నిర్వహించడానికి పోలీస్ వారితో ముందస్తు అనుమతి తీసుకోవాలని, ఎన్నికల్లో ఓటర్లను గుర్తించడాని కి ఎంపీడీవోలు, తాసిల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు ఉంటారని చెప్పారు. సమావేశంలో జెడ్పీ సీఈవో విజయనాయక్, ఎంపీడీవోలు, తాసిల్దార్లు, రాజకీయ పార్టీల నాయకులు త దితరులు పాల్గొన్నారు.