పెద్దమందడి, నవంబర్ 15 : రైతులు పండించిన వరిధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులు ఆందోళన చెందొద్దని సింగిల్ విండో అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంతోపాటు మండలంలోని మోజర్ల, అల్వాల తదితర గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాలను సింగిల్‌విండో ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. యాసంగి కాలంలో రైతులు వరి పంటకు బదులుగా వాణిజ్య పంటలు, అరుతడి పంటలను సాగు చేయాలని సూచించారు. అదేవిధంగా మండలంలోని జంగమాయిపల్లి, బలిజపల్లి, పామిరెడ్డిపల్లి, గట్లఖానాపూర్ తదితర గ్రామాల్లో కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రఘుప్రసాద్, సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు సత్యారెడ్డి, విండో డైరెక్టర్ నరేశ్, ఉప సర్పంచ్ రాంచంద్రయ్య, ఎంపీటీసీ చెన్నమ్మ, పుల్లన్నయాదవ్, రాధాకృష్ణ, సర్పంచులు సువర్ణ, సునీత, మాజీ ఉప సర్పంచ్ చిన్న అఖిల్, ఏఈవో, సీఈవో సుధాకర్‌రెడ్డి, ఉప సర్పంచ్ హరిచంద్రారెడ్డి, సింగిల్‌విండో సీఈవో జగదీశ్వర్‌రెడ్డి, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు గట్టు సతీశ్, రైతులు పాల్గొన్నారు.
రైతులు సద్వినియోగం చేసుకోవాలి
ఖిల్లాఘణపురం, నవంబర్ 15 : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ కృష్ణనాయక్ అన్నారు. సోమవారం మండల కేంద్రంతోపాటు మండలంలోని మల్కినియాన్‌పల్లి, అల్లమాయిపల్లి, సోలీపూర్‌లో సింగిల్‌విండో అధ్యక్షుడు మురళీదర్‌రెడ్డి ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ కృష్ణనాయక్, జెడ్పీటీసీ సామ్యనాయక్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాళ్ల కృష్ణయ్య హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యాన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొంటుందన్నారు. రైతులు ధాన్యాన్ని సంబంధిత కొనుగోలు కేంద్రాలోనే అమ్ముకోవాలని సూచించారు. కార్యక్రమంలో సింగిల్‌విండో డైరెక్టర్లు కృష్ణయ్యగౌడ్, శేఖర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, మండల వ్యవసాయాధికారి రఘురాం, ఏఈవోలు, సర్పంచులు, ఎంపీటీసీలు, రైతు సంఘాల నాయకులు, రైతులు పాల్గొన్నారు.
అప్పరాలలో..
కొత్తకోట, నవంబర్ 15 : మండలంలోని అప్పరాల గ్రామంలో సోమవారం ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ హిమబిందు, పీఏసీసీఎస్ ఉపాధ్యక్షుడు వెంకటయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, రైతులు అదైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.1,960, బీ గ్రేడ్ ధాన్యానికి రూ.1,940 ధరతో ప్రభు త్వం కొనుగోలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ చిట్టెమ్మ, మాజీ ఎంపీటీసీ కృష్ణయ్య, సాయిరెడ్డి, మొగుల న్న, నాగార్జున్‌రెడ్డి, రాజ్‌కుమార్‌రెడ్డి, బుచ్చారెడ్డి, యాద య్య, గట్టు, శ్రీనివాస్, అనిల్‌కుమార్‌రెడ్డి, నాగవర్ధన్‌రెడ్డి, ఉప్పరిస్వామి, మహిళా సంఘాల సభ్యులు ప్రభావతి, రైతులు పాల్గొన్నారు.
పెబ్బేరు, శ్రీరంగాపూర్ మండలాల్లో..
శ్రీరంగాపూర్, నవంబర్ 15 : వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఉమ్మడి మండలంలోని పెబ్బే రు మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్, శ్రీరంగాపూర్ మండలంలోని శ్రీరంగాపూర్, వెంకటపూర్ గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాలను మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు మంగరాయి శ్యామల, సింగిల్‌విండో అధ్యక్షుడు గౌని కోదండరాంరెడ్డి, జగన్నాథం నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కె ట్ కమిటీ అధ్యక్షురాలు మంగరాయి శ్యామల మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వ మే కొనుగోలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపీ పీ గాయత్రీ, శ్రీరంగాపూర్ రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు గౌడ్‌నాయక్, కోఆప్షన్ సభ్యులు ఆరీఫ్, టీఆర్ఎన్ నాయకులు పాల్గొన్నారు.