ఆర్టీసీ బస్‌డిపోకు ఏర్పాటుకూ అనుమతి
టీవల రవాణా శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లిన జడ్పీ చైర్మన్ జగదీశ్వర్
సుముఖత వ్యక్తంచేసిన పువ్వాడ
త్వరలో నెరవేరనున్న ఏజెన్సీవాసుల ఆకాంక్ష
మరింత మెరుగుపడనున్న రవాణా సౌకర్యం
ఏటూరునాగారం, సెప్టెంబర్ 12 : ఏజెన్సీ ప్రాంతవాసుల చిరకాల కోరిక త్వరలో నెరవేరనుంది. ఏటూరునాగారంలో ఆర్టీసీ బస్‌డిపోతో పాటు మోడల్ బస్‌స్టేషన్ ఏర్పాటు కానున్నది. బస్‌డిపో కోసం గతంలో చందూలాల్ మంత్రిగా ఉన్నప్పుడు రూ.కోటి మంజూరు కాగా, అనివార్య కారణాలతో ముందడుగు పడలేదు. తాజాగా ఈ విషయాన్ని ములుగు జడ్పీ చైర్మన్ జగదీశ్వర్.. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ దృష్టికి తీసుకెళ్లగా, సానుకూలంగా స్పందించి అనుమతి ఇచ్చినట్లు సమాచారం. తాజా నిర్ణయం కార్యరూపం దాల్చితే రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు, ఇటు పొరుగున ఉన్న ఛత్తీస్‌గఢ్ రాష్ర్టానికి రవాణాపరంగా సౌకర్యం మరింత మెరుగుపడనుంది.
ఏటూరునాగారంలో మోడల్ బస్‌స్టేషన్‌తో పాటు బస్ డిపో ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన త్వరలో కార్యరూపం దాల్చనుంది. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. కొన్ని దశాబ్దాలుగా ఏటూరునాగారంలో బస్‌డిపో ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో గతంలో ఈ మేరకు డిపో మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అనివార్య కారణాలతో బస్‌డిపో ఏర్పాటులో జాప్యం ఏర్పడింది. రెండు సంవత్సరాల క్రితం నాటి రాష్ట్ర మంత్రి చందూలాల్ బస్‌డిపో నిర్మాణం కోసం రూ.కోటి వరకు నిధులు కూడా మంజూరు చేయించారు. ఏటూరునాగారంలో బస్డిపోతోపాటు మోడల్ బస్ స్టేషన్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన బలంగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఇక్కడి వై జంక్షన్ నుంచి కూరగాయల మార్కెట్ వరకు రోడ్డు విస్తరణ చేపట్టి డివైడర్లు ఏర్పాటు చేశారు. దీంతో ఏటూరునాగారానికి సరికొత్త కళ వచ్చింది. అటు చత్తీస్‌గఢ్ నుంచి ఏటూరునాగారం మీదుగా వరంగల్, హైదరాబాద్‌కు తక్కువ దూరంతో మార్గం ఏర్పడి రాకపోకలు పెరిగాయి. వాజేడు, వెంకటాపురం, చర్ల ప్రాంతానికి చెందిన ప్రజలు కూడా ఏటూరునాగారం వైపు రావడానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఏటూరునాగారంలో మోడల్ బస్‌స్టేషన్ అవసరమని భావించిన జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ ఇటీవల రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. దీనికి సదరు మంత్రి కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఏటూరునాగారంలో మోడల్ బస్ స్టేషన్‌ను సుందరంగా నిర్మించనున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం ఏటూరునాగారం నుంచి హైదరాబాద్, రాజమండ్రి, విశాఖపట్నం, శ్రీశైలం, భధ్రాచలం, భూపాలపల్లి, గోదావరిఖని, సూర్యాపేట, కరీంనగర్‌తోపాటు ఏజెన్సీలోని మారుమూల గ్రామాలకు కూడా బస్సులు నడుస్తున్నాయి. నిత్యం సుమారు 50 నుంచి 60 వరకు బస్సులు ఇక్కడి బస్‌స్టేషన్‌కు వచ్చి పోతుంటాయి.
మోడల్ బస్‌స్టేషన్‌లో సకల సౌకర్యాలు
మోడల్ బస్‌స్టేషన్‌తో ఈ ప్రాంత ప్రజలకు రవాణా సౌకర్యంతో పాటు ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రతిపాదించారు. బస్‌స్టేషన్‌లో ప్లాట్‌ఫారాలను పెంచడంతో పాటు షాపింగ్ కాంప్లెక్స్, పండ్ల దుకాణాలు, కూల్ డ్రింక్స్ షాపు, స్వచ్ఛమైన తాగునీరు, క్యాంటీన్, పై అంతస్తులో ప్రయాణికుల సౌకర్యార్థం లాడ్జి తరహాలో రెస్టు రూంలు ఏర్పాటు చేయనున్నారు. బస్టాండ్‌లో పరిశుభ్రత పాటించడంలో భాగంగా సులభ్ కాంప్లెక్స్ తరహాలో టాయిలెట్స్ ఏర్పాటు కానున్నాయి. దీంతో అనేక మందికి ఉపాధి కలుగనుంది. ఇక బస్సు డిపో ఏర్పాటుకు గతంలోనే ప్రధాన రహదారి వెంట భూమి కేటాయించారు. ప్ర స్తుతం ఇదే భూమిలో బస్‌డిపో ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది.
రవాణా శాఖ మంత్రి హామీ