పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్
నందిగామ, జనవరి 12 : పాడి రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. వర్షాధారిత ప్రాంతం అభివృద్ధి పథకం ద్వారా మంజూరైన 20 యూనిట్ల ఆవులను బుధవారం ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందజేశారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఉత్తమ రైతులకు సన్మానం…
నందిగామ మండలంలో ఉత్తమ రైతులుగా ఎంపికైన జిల్లెల్ల బాల్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, చేగూరు గ్రామానికి చెందిన యాదయ్యలను ఎమ్మెల్యే సన్మానించి జ్ఞాపికను అందజేశారు. సేంద్రియ వ్యవసాయం వైపు రైతులు మొగ్గు చూపే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ పథకం ద్వారా చంద్రయాన్గూడ గ్రామానికి చెందిన యాదయ్యకి రూ.49 వేలు, శ్రావణ్‌కి రూ.12 వేల చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, ఎంపీపీ ప్రియాంకగౌడ్, నందిగామ సర్పంచ్ వెంకట్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నారాయణరెడ్డి, మాజీ ఎంపీపీ శివశంకర్‌గౌడ్, ఉపసర్పంచ్ కుమార్‌గౌడ్, వార్డు సభ్యులు, వ్యవసాయ శాఖ అధికారులు రాజారత్నం, శ్వేత, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
కార్యకర్తలకు అండగా టీఆర్ఎస్
టీఆర్ఎస్ కార్యకర్తలకి పార్టీ అండగా ఉంటుందని షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. నందిగామ మండల కేంద్రానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త గోద కృష్ణ కొన్ని రోజుల క్రితం మృతి చెందాడు. పార్టీలో సభ్యత్వం ఉండటంతో టీఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ ద్వారా మంజూరైన రూ.2 లక్షల చెక్కును సర్పంచ్ వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో కృష్ణ భార్య అనితకు బుధవారం ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, ఎంపీపీ ప్రియాంకగౌడ్తో కలిసి అదంజేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ అశోక్, ఉపసర్పంచ్ కుమార్‌గౌడ్, నారాయణరెడ్డి, శివశంకర్‌గౌడ్, విఠల్ తదితరులు
యువత ఆదర్శంగా తీసుకోవాలి
షాద్‌నగర్ : నేటితరం యువతకు ఆదర్శప్రాయుడు స్వామి వివేకానందుడని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జిల్లె డు చౌదరిగూడ మండలం పద్మారం గ్రామంలో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని బుధవారం ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మన దేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పన మహనీయుడు స్వామి వివేకానందుడని, యువత ఆయన ఆలోచనా విధానాలతో ముందుకు సాగాలన్నారు. ఆయన సూచించిన మార్గంలో యువత నడుచుకుంటే దేశం శరవేగంగా అభివృద్ధి చెందుతుందనే విషయాన్ని అందరూ గ్రహించాలాన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.