
మహబూబ్‌నగర్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కొల్లాపూర్ మామిడి పేరు వింటేనే నోరూరుతుంది. రాష్ట్రంలో కొల్లాపూర్ మామిడికి ఎంతో డిమాండ్ ఉన్నది. మిగతా మామిడి పండ్ల రకాలతో పోలిస్తే ముందే కోతకు వచ్చే ఈ పండ్లు రుచికి, పోషకాలకు ప్రఖ్యాతి. రైతు తోట వద్దకే వ చ్చి కొనుగోళ్లు చేసుకుపోయే కొల్లాపూర్ మామిడి పండ్లు హైదరాబాద్, ముంబయి వంటి ప్రాంతాలకే కాకుండా విదేశాలకు సైతం ఎగుమతి అవుతాయి. అత్యధిక టీఎస్ఎస్ (టోటల్ సోలబుల్ సాలిడ్) ఉండే ఈ మామిడి పండ్ల తీపి ఒకసారి తింటే మర్చిపోరు. ఇంతటి మధురమైన ఈ మామిడి పండ్లు కొ ల్లాపూర్ ప్రాంతానికే పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చాయి. ఇక్కడి నేల, వాతావరణం వల్లే అది సాధ్యమైంది. భారీగా డిమాండ్ ఉన్న ఈ మామిడి పండ్లు పండించే రైతులకు మరింత గిట్టుబాటు అయ్యేలా చేసేందుకు తెలంగాణ సర్కారు సిద్ధమైంది. భౌగోళికంగా ఈ ప్రాంతానికే సొంతమైన కొల్లాపూర్ మామిడికి భౌగోళిక సూచి (జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్) సాధిస్తే వీటికి మరింత డిమాండ్ వస్తుందని ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. ఇ ప్పటికే కొండా లక్ష్మణ్ ఉద్యాన వర్శిటీ పరిశోధన విభాగం అధికారులు ఆ ప్రక్రియ ప్రారంభించారని స్థానిక అధికారులు వెల్లడించారు.
భౌగోళిక గుర్తింపుతో మరింత డిమాండ్
కొల్లాపూర్ మామిడి పండ్లకు ఎంతో డిమాండ్ ఉంది. నాగర్‌కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ ప్రాం తంలో సుమారు 34 వేల ఎకరాల్లో ఈ మామిడి పండుతుంది. ప్రఖ్యాతి చెందిన ఈ పండ్లకు భౌగోళిక సూచిక (జీఐ) గుర్తింపు పొందేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మామిడి రకానికి జీఐ సూచిక కోసం భారత వ్యవసాయ పరిశోధనా మం డలి (ఐసీఏఆర్)కి దరఖాస్తు చేసేందుకు కొండా లక్ష్మణ్ ఉద్యాన వర్సిటీ పరిశోధనా విభాగం ప్రయత్నాలు ప్రారంభించింది. దీనిపై స్థానికంగా ఈ పంటకు సంబంధించి పూర్తి వివరాలను అధికారు లు సేకరించారు. నేల స్వభావం, వాతావరణ పరిస్థితులు, టీఎస్ఎస్ శాతం, దిగుబడి వివరాలను క్రోడీకరించారు. అరకు కాఫీ, కాకినాడ కాజాలాగా కొల్లాపూర్ మామిడి పండ్లకు జీఐ వస్తే డిమాండ్ మరింత పెరగనున్నది. ఎగుమతి చేసేందుకు ఓ బ్రాండ్ లభిస్తుంది.
ఉమ్మడి జిల్లాకు మ్యాంగో క్లస్టర్ మంజూరు..
ఉమ్మడి జిల్లాలో సుమారు 57 వేల ఎకరాలకుపైగా మామిడి సాగవుతున్నది. 17,284 రైతులకు మామడి తోటలున్నాయి. అయితే సరైన మార్కెటిం గ్ సదుపాయాలు, మౌలిక వసతులు లేకపోవడం తో రైతులకు లాభాలు తక్కువగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మామిడి రైతుల సమస్యలపై కేంద్రం దృష్టికి తీసుకుపోయింది. స్పందించిన కేం ద్రం దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న 3 క్లస్టర్లలో ఒకటి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాను ఎంపిక చేసింది. ఈ క్లస్టర్ స్థాయి కార్యక్రమం కోసం కేంద్రం రూ.100 కోట్లు విడుదల చేయనున్నది. ఈ క్లస్టర్ ద్వారా మామిడి రైతులు తాము పండించిన పంటను విదేశాలకు ఎగుమతి చేసి మంచి లాభాలు ఆర్జించేలా చూడటమే లక్ష్యంగా అధికారులు కసరత్తు ప్రారంభించారు. నాణ్యమైన పండ్లను ప్రత్యేకంగా గ్రేడింగ్ చేసి ఎక్కువ ధరకు విక్రయించేలా రైతులకు క్లస్టర్ స్థాయిలో శిక్షణ ఇస్తారు. సరైన సస్యరక్షణ చర్యలతోపాటు పంట కోతపై కూడా మెలకువలు నేర్పించడడం, మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు ప్రణాళిక తయారు చేస్తున్నారు. ఒక్కో రైతే స్వంతంగా మార్కెటింగ్ చేసుకునే అవకాశం ఉండ దు కాబట్టి ఎఫ్‌పీవోలను ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారా విదేశాలకు సైతం నాణ్యమైన పండ్లను ఎగుమతి చేసే ప్రణాళిక తయారు అవుతున్నది. కోల్డ్ స్టోరేజీలు, ప్యాకింగ్ హౌజ్‌లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించి మామిడి రైతును ఆదుకోనున్నారు. మ్యాంగో క్లస్టర్ వల్ల రైతుల దశ దిశ మారుతుందని మహబూబ్‌నగర్ ఉద్యాన శాఖ డీడీ సాయిబాబా తెలిపారు.
కొల్లాపూర్ మామిడి ప్రత్యేకతలివే..
రాష్ట్రంలో అన్ని చోట్ల మామిడి పండ్లు ఏప్రిల్ నుంచి దిగుబడి ఇస్తాయి. కానీ కొల్లాపూర్‌లో మాత్రం మార్చి మొదటి వారంలోనే పంట చేతికవస్తుందని ఉద్యానశాఖ అధికారులు తెలిపారు. మిగతా ప్రాంతాల మామిడి పం డ్లు కోత దశకు వచ్చే వరకే కొల్లాపూర్ పండ్ల మార్కెటింగే పూర్తవుతుంది. నెల రోజులు ముందుగా నే పండ్ల దిగుబడి రావడం, రుచి లో మిగతా వాటికంటే బాగుండటం వల్ల తోటల వద్దకే వచ్చి కిలో రూ.85 వర కు చెల్లించి కొనుగోలు చేస్తారు. ఒక్కో పండు 300 నుంచి 400 గ్రాములు ఉండటం వల్ల కిలోకి 3 పం డ్ల కంటే ఎక్కువ తూగవు. 4 కేజీల బాక్సులో ప్యా కింగ్ చేసేందుకు 12 పండ్లు సరిగ్గా సరిపోతాయి. వీటిని హైదరాబాద్, ముంబయితో పాటు విదేశాలకు సైతం ఎగుమతి చేస్తా రు. ఈ పండ్ల టోటల్ సోలబు ల్ సాలిడ్ (టీఎస్ఎస్) 20 శాతం వరకు ఉంటుంది. అందువల్లే అత్యంత మధురంగా ఉంటాయి. వీటి ప్ర త్యేకత తెలుసు కాబట్టే ద ళారులు కొల్లాపూర్‌కు క్యూ కట్టి తరలించుకుపోతారు. అఖిల భారత పండ్ల ప్రదర్శనలో కొల్లాపూర్ రాజా గార్డెన్‌లోని మామిడి పండ్లకు 1960లో ప్రథమ బహుమతి లభించింది. అంటే వీటి ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు.