చౌదరిగూడలో ఎడ్లబండ్ల ర్యాలీ
పూడూరులో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం
పాల్గొన్న ప్రజాప్రతినిధులు, రైతులు
షాద్‌నగర్, జనవరి11: రైతు సంక్షేమ రాజ్యంగా తెలంగాణ రాష్ట్రం విరాజిల్లుతుందని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. మం గళవారం చౌదరిగూడ మండల కేంద్రంలో నిర్వహించిన రైతు బంధు సంబురాల్లో పాల్గొని మాట్లాడారు. రైతుల శ్రేయస్సు కోసం నిరం తరం ఉచిత విద్యుత్‌ను అందించడంతో పాటు సాగునీటి ప్రాజెక్టు లను నిర్మించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని చెప్పారు. రైతు బీమా, రైతు బంధు పథకాలు రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు నిం పాయని తెలిపారు. అన్ని వర్గాల రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సం క్షేమ పథకాలను అందిస్తుందని చెప్పారు. మండల కేంద్రంలో నిర్వ హించిన ఎడ్ల బండి ర్యాలీలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.
పూడూరు , జనవరి 11: రైతు బంధు డబ్బులు ఖాతాలో జమ కావడంతో ప్రతి రైతు సంతోషంగా సంబురాలు జరుపుకొంటున్నట్లు , మండల రైతు బంధు సమితి కన్వీనర్ రాజేందర్‌రెడ్డి పేర్కొన్నారు. పూడూరు మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద రైతు బంధు సంబు రాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతు బంధు, రైతు బీమా వంటి పలు పథకాలను ప్రవేశపెట్టి రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నారన్నారు. ప్రతి సంవత్సరం రెండు దఫాలుగా రూ.10వేలను నేరు గా రైతుల ఖాతాల్లో జమచేస్తున్న ఘనత కేసీఆర్‌దే అన్నారు. కార్యక్రమంలోఎంపీపీ మల్లేశం, జడ్పీటీసీ మేఘమాల, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ రాజేందర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, సర్పంచ్ నవ్యరెడ్డి, ఎంపీటీసీ సల్మాబేగం, అనంతరెడ్డి, ఏవో సామ్రాట్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.