కల్వకుర్తి, అక్టోబర్ 10: దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా కల్వకుర్తి ప ట్టణంలోని వాసవీ కన్యకా పరమేశ్వ రి ఆలయంలో అమ్మవారు ఆదివా రం లలితాదేవి అలంకరణలో భక్తుల కు దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో భా గంగా దంపతులు సామూహిక కుం కుమార్చనలు నిర్వహించారు. సాం స్కృతిక ప్రదర్శనలు, ఇంద్రజాల ప్ర దర్శన, వెల్ బేబీషో కార్యక్రమాలు భ క్తులను అలరించాయి. గీతా ప్రచార సమితి ఆధ్వర్యంలో భగవద్గీత పారాయణం చేశారు. ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి, జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి. జెడ్పీ వైస్‌చైర్మన్ బాలాజీసింగ్ అమ్మవారిని దర్శించుకొని పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వారిని ఉత్సవ కమిటీసభ్యులు శాలువాలు కప్పి సన్మానించారు. సాయంత్రం మహిళలు దాండియా ఆడారు. అనంతరం పట్టణంలోని మైసమ్మ ఆలయాన్ని ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి దర్శించుకొని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీని ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో కన్యకా పరమేశ్వరి ఆలయ ఫౌండర్ ట్రస్టీ, చైర్మన్ జూలూరి రమేశ్‌బాబు, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు వెంకటేశ్, ప్రభాకర్, నారాయణరాజు, కృష్ణయ్య, శంకర్, గోవర్ధన్, జగదీశ్వర్, విజయభాస్కర్, మాజీ సర్పంచులు సుదర్శన్‌రెడ్డి, ఆనంద్‌కుమార్, చిన్నరాంరెడ్డి, వాసవీక్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
శాకాంబరి మాత అలంకరణలో అమ్మవారు
కల్వకుర్తి రూరల్, అక్టోబర్ 10 : మండలంలోని ఆయా గ్రామాల్లో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. అమ్మవారు ఆదివారం శాకాంబరి మాత అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తర్నికల్ ఆంజనేయస్వామి ఆలయంలో కనక దుర్గామాత భక్త బృందం, భక్తుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి ఒడిబియ్యం పెట్టి పూజల అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు.