
కోస్గి, అక్టోబర్ 10 : పేదలు నిలువు దోపిడీకి గురవుతున్నారు. ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న రేషన్‌బియ్యాన్ని దళారులు కొనుగోలు చేస్తున్నారు. రైస్‌మిల్లర్లతో కుమ్మక్కై పీడీఎస్ బియ్యాన్ని పాలిష్ చేసి సన్న బియ్యమంటూ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఆదివారం ఓ రైస్‌మిల్‌కు ప్రైవేట్ వాహనంలో రేషన్ బియ్యం వ చ్చాయి. స్థానికులు గమనించి అధికారులకు ఫిర్యాదు చేస్తామని ఫొటోలు తీయడంతో అ క్కడి నుంచి వాహనాన్ని రూటు మార్చారు. వారం రోజులకిందట మరో వద్ద ఇలాగే ప ట్టుబడితే అప్పటికప్పుడు బియ్యం కాదని వాహనాన్ని అక్కడి నుంచి పంపించారు. కొంత కాలంగా మార్కెట్లో పీడీఎస్ బియ్యం పెద్ద మొత్తం లో కొనుగోలు చేస్తూ పట్టుబడినా అధికారులు తూతూ మంత్రంగా చర్యలు చేపడుతున్నారు. దీంతో అక్రమార్కులకు భయం లేకుండాపోయింది. దర్జాగా కొనుగోలు చేసి వినియోగదారులను మోసం చేస్తున్నారు. రైస్‌మిల్లర్లను పర్యవేక్షించాల్సిన సంబంధిత శాఖల అధికారులు అటు వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఇప్పటికైనా అధికారు లు స్పందించి ప్రభుత్వం సరఫరా చేస్తున్న రేషన్ బియ్యం తో రైస్ మిల్లర్లు ఇలాంటి అక్రమాలకు పాల్పడకుండా చ ర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.