
ఎమ్మెల్యే రాములునాయక్
వైరా/ కొణిజర్ల/ కారేపల్లి రూరల్, అక్టోబర్ 8 : వైరా నియోజకవర్గంలోని సింగరేణి, కొణిజర్ల మండలాలకు సంబంధించిన పలు సమస్యలపై శుక్రవారం అసెంబ్లీ సమావేశాల ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ ప్రస్తావించారు. సింగరేణి మండలంలోని రేగులగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని చీమలివారిగూడెం నుంచి ప్రవహించే బుగ్గవాగు వర్షాకాలంలో పొంగి ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోతున్నందున హైలెవల్ వంతెన నిర్మించాలని కోరారు. కొణిజర్ల మండలంలోని పల్లిపాడు నుంచి ఏన్కూరు ప్రధాన రహదారిలోని అంజనాపురం వద్ద వద్ద కూడా హైలెవల్ వంతెన నిర్మించాలని ఎమ్మెల్యే కోరారు. మంత్రి ఎర్రబల్లి దయాకర్రావు మాట్లాడుతూ నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.