మఠంపల్లి, అక్టోబర్ 6 : రాష్ట్ర ప్రభుత్వం అన్నివర్గాల పండుగలకు సమప్రాధాన్యం ఇస్తున్నదని ఎంపీపీ ముడావత్ పార్వతీకొండానాయక్, జడ్పీటీసీ జగన్నాయక్ అన్నారు. బుధవారం మండలంలోని పలు గ్రామాల్లో లబ్ధిదారులకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఇరుగు పిచ్చయ్య, ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడు పల్లె మట్టయ్య, మండల అధికార ప్రతినిధి రవీందర్‌నాయక్, ఎస్టీ సెల్ మండలాధ్యక్షుడు శంకర్‌నాయక్, ఎంపీటీసీ కుందూరు వెంకట్‌రెడ్డి, సర్పంచ్ విజయలక్ష్మీవెంకటరమణ, ఎంపీడీఓ జానకిరాములు, వార్డు సభ్యుడు అయ్యప్ప పాల్గొన్నారు.
పాలకవీడు : మండలంలోని హన్మయ్యగూడెంలో సర్పంచ్ కుందూరు సరిత బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ క్రాంతి, టీఆర్ఎస్ నాయకులు కుందూరు ఇంద్రారెడ్డి, వార్డు సభ్యులు కందుకూరు సుజాత, మలావత్ శ్రీను, మల్గిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
మోతె : మండలంలోని తుమ్మగూడెంలో సర్పంచ్ నర్సిరెడ్డి
బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. పంచాయతీ కార్యదర్శి పుల్లయ్య, వార్డు సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.
మునగాల : మండలంలోని తాడ్వాయి గ్రామంలో మాజీ జడ్పీటీసీ కోల ఉపేందర్‌రావు, మాధవరంలో ఎంపీపీ ఎలక బిందు మహిళలకు చీరెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచులు లొడంగి సంజీవ్, నంద్యాల విజయలక్ష్మి, గట్టు ఉపేందర్, ఆంజనేయులు, రాఘవయ్య, టీఆర్ఎస్ మండల కార్యదర్శి వెంకట్‌రెడ్డి, మహిళా విభాగం మండలాధ్యక్షురాలు కవిత, గ్రామాధ్యక్షుడు వెంకన్న పాల్గొన్నారు.
గరిడేపల్లి : మండలంలోని గానుగబండ, కట్టవారిగూడేల్లో హుజూర్నగర్ ఏఎంసీ చైర్మన్ కడియం వెంకట్‌రెడ్డి, ఎంపీపీ పెండెం సుజాతాశ్రీనివాస్గౌడ్ చీరెలు పంపిణీ చేశారు. సర్పంచులు వీరాస్వామి, మీసాల అపర్ణ, కీత జ్యోతీరామారావు, ఎన్.ప్రసాద్, ఎంపీటీసీ కడియం నళినీవెంకట్రెడ్డి, ఉప సర్పంచ్ ఉపేందర్‌రావు పాల్గొన్నారు.
చిలుకూరు : మండలంలోని పలు గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు లబ్ధిదారులకు చీరెలు అందజేశారు. తాసీల్దార్ రాజేశ్వరీదేవి, సిబ్బంది పాల్గొన్నారు.
కోదాడ రూరల్ : మండలంలోని పలు గ్రామాల్లో ఎంపీపీ చింతా కవితారెడ్డి బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. జడ్పీటీసీ మందలపు కృష్ణకుమారి, సర్పంచులు దొంగల లక్ష్మీనారాయణ, పాముల మస్తాన్, వీరేపల్లి వెంకటసుబ్బారావు, పొట్ట శ్రీవిజయకిరణ్, పీఏసీఎస్ చైర్మన్ నలజాల శ్రీనివాస్‌రావు, టీఆర్ఎస్ మండలాధ్యక్ష, కార్యదర్శులు కాసాని శ్రీనివాస్, శెట్టి సురేశ్, ఉపాధ్యక్షుడు గడిపూడి శ్రీకాంత్, మండల కో-ఆప్షన్ సభ్యుడు ఎస్కే ఉద్దండు, జబ్బార్, కొళ్లూరి వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు అమరబోయిన శ్రీనివాస్‌యాదవ్, ముడియాల వెంకట్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, అంజిరెడ్డి పాల్గొన్నారు.
సూర్యాపేట రూరల్ : మండలంలోని దాస్తండా, ఇమాంపేట గ్రామాల్లో ఎంపీపీ బీరవోలు రవీందర్‌రెడ్డి, జడ్పీటీసీ జీడి భిక్షం చీరెలు పంపిణీ చేశారు. వైస్ ఎంపీపీ రామసాని శ్రీనివాస్‌నాయుడు, సర్పంచులు నూనావత్ మోతీలాల్, పాముల ఉపేందర్, ఎంపీటీసీ మామిడి కిరణ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వంగాల శ్రీనివాస్‌రెడ్డి, ఉప సర్పంచులు కుంభం సుజాత, బుజ్జి, టీఆర్ఎస్ బీసీ సెల్ మండలాధ్యక్షుడు కుంభం వెంకన్న, నాయకులు శ్రీనివాస్‌నాయుడు, సుదర్శన్, రాంబాబు పాల్గొన్నారు.
పెన్‌పహాడ్ : మండలంలోని దూపాడ్లో జడ్పీటీసీ మామిడి అనితాఅంజయ్య బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ బిట్టు నాగేశ్వర్రావు, మద్యాల గీతాంజలి, గుగ్గిళ్ల సోమయ్య, పుష్పావతి, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.