
ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
కాలనీలో బతుకమ్మ చీరెల పంపిణీ
అమీన్పూర్, అక్టోబర్ 6: దసరా పండుగను పురస్కరించుకుని ప్రభుత్వం తరఫున బతుకమ్మ చీరెలు అందజేయడం ఆడబిడ్డలకు ఇచ్చే గౌరవం అని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాలనీలోని మహిళలకు బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సం స్కృతి, సంప్రదాయలకు చిహ్నమే బతుకమ్మ అని అన్నారు. ప్రపంచంలో పూలను పూజించే ఏకైక పండుగ బతుకమ్మ అని, పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరుతూ.. పండు గ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలోని మహిళలు పండుగను కొత్త దుస్తులతో సంతోషంగా జరుపుకోవాలనే సీఎం కేసీఆర్ మహిళలకు బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ బతుకమ్మ చీరెలను తెలంగాణ ప్రభుత్వం అందజేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నర్సింహాగౌడ్, తహసీల్దార్ విజయ్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ సుజాత, ఆయా వార్డుల కౌన్సిలర్లు బాశెట్టి కృష్ణ, బిజిలీ రాజు, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, బాలరాజు, దాస్‌యాదవ్, రమేశ్‌గౌడ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బాల్‌రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు తలారి రాములు, యూనూస్, కాలనీవాసులు ఉన్నారు.
మున్సిపల్ కార్యాలయంలో..
పండుగను పురస్కరించుకుని బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, కమిషనర్ సుజాత చీరెలను పంపిణీ చేశారు.
బొల్లారం పరిధిలో…
బొల్లారం, అక్టోబర్ 6 : బతుకమ్మను మహిళలు వైభవంగా జరుపుకోవాలనే సంకల్పంతోనే సీఎం కేసీఆర్ మహిళలకు చీరెలను అందజేస్తున్నారని మున్సిపల్ చైర్పర్సన్ కొలన్ రోజాబాల్రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చంద్రారెడ్డి అన్నారు. జ్యోతినగర్తో పాటు పలు వార్డుల్లోని మహిళలకు రేషన్ దుకాణాల వద్ద బతుకమ్మ చీరెలను పంపీణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ టీఆర్ఎస్ అధ్యక్షుడు హన్మంత్‌రెడ్డి, కౌన్సిలర్లు రాధ, సంధ్య, శైలజ, బీరప్పయాదవ్, ప్రభు, రేషన్ డీలర్లు, మహిళలు పాల్గొన్నారు.
కల్హేర్, అక్టోబర్ 6: బతుకమ్మ పండుగ నేపథ్యంలో ఆడపడుచులకు అన్నగా సీఎం కేసీఆర్ చీరెలను పంపిణీ చేస్తున్నారని ఎంపీపీ మైపాల్‌రెడ్డి అన్నారు. సిర్గాపూర్ మండల పరిధిలోని పొట్పల్లి, పెద్ద ముబారక్పూర్ గ్రామాల్లో బతుకమ్మ చీరలను వైస్ ఎంపీపీ మధవరావుతో కలిసి పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ దిగంబర్‌రావు, నాయకులు రాజు, సాయిలు, నర్సింలు, బాలయ్య, సం జీవులు, మహిళలు ఉన్నారు.