
గజ్వేల్, అక్టోబర్ 6 : పోలీస్ సిబ్బంది వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు, కుటుంబ సభ్యుల ఆరో గ్యంపై జాగ్రత్తగా వ్యవహరించాల ని గజ్వేల్ ఏసీపీ రమేశ్ సూచించారు. బుధవారం గజ్వేల్ పట్టణంలోని ఐ వోసీలో పోలీస్ కమిషనర్ జోయల్ డెవిస్ ఆదేశాల మేరకు పోలీసు సిబ్బందికి యశోద దవాఖాన సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్య శిబిరంలో పోలీసులకు, వారి కుటుంబ సభ్యులకు వివిధ వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ రమేశ్ మాట్లాడుతూ పోలీసుల దినచర్య, జీవన విధానం మిగతా వారికంటే పూర్తి భిన్నంగా ఉంటుందని, కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలన్నారు. ప్రతిరోజూ వ్యాయామం, నడక, యోగా దినచర్యలో భాగంగా చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరీక్షలను చేయించుకుంటూ అవసరమైన జాగ్రత్తలు పాటించాలన్నారు. కార్యక్రమంలో సీఐ ఆంజనేయులు, రూరల్ సీఐ కోటేశ్వరరావు, తొగుట సీఐ రవీందర్, ట్రాఫిక్ సీఐ మధుసూదన్‌రెడ్డి, అదనపు సీఐ శేఖర్‌రెడ్డి, గజ్వేల్ డివిజన్ ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.