బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
నిందితులు ముగ్గురూ లైఫ్‌లైన్ హాస్పిటల్ ఫార్మసీ నిర్వాహకులు
28 ఇంజక్షన్లు.. రూ.20వేలు స్వాధీనం
వివరాలు వెల్లడించిన సీపీ తరుణ్‌జోషి
హన్మకొండ సిటీ, మే 6 : కరోనా చికిత్సలో వినియోగించే రెమ్‌డెసివర్ ఇంజక్షన్‌ను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్న ముఠాను గురువారం వరంగల్ కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలను పోలీస్ కమిషనర్ తరుణ్‌జోషి గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో రెమ్‌డెసివర్ ఇంజక్షన్ మా ర్కెట్లో ప్రస్తుతం తగినంత అందుబాటులో లేదు. దీంతో నగరంలోని లైఫ్‌లైన్ హాస్పిటల్లో ఫార్మసీ నిర్వహించే మండిబజార్‌కు చెందిన బాగాజీ మనోహర్, భీమారానికి చెంది న కొలిపాక కుమారస్వామి, కరీమాబాద్‌కు చెందిన ఐత అశోక్ హెటిరో కంపె నీ నుంచి ఇంజక్షన్‌ను రూ.2,800 చొప్పున కొనుగోలు చేశారు. సాధారణంగా కరోనా వ్యాధిగ్రస్తులకు రూ.3,490కి దీన్ని విక్రయించాల్సి ఉండగా, కొరతతో రూ.35,000 నుంచి రూ.45,000 వరకు బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారు. సమాచారం అందు కున్న టాస్క్‌ఫోర్స్ సిబ్బంది సుబేదారి పోలీసుల సహకారంతో లైఫ్‌లైన్ దవాఖాన ఫార్మసీపై దాడులు చేశారు. వారి వద్ద నుంచి 28 ఇంజక్షన్లతోపాటు రూ.20వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. ఈ సందర్భంగా నిందితులను అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన సెంట్రల్ జోన్ డీసీపీ పుష్ప, హన్మకొండ, టాస్క్‌ఫోర్స్ ఏసీపీలు జితేందర్‌రెడ్డి, ప్రతాప్‌కుమార్, ఇన్స్పెక్టర్లు రాఘవేందర్, శ్రీనివాస్‌జీ, టాస్క్‌ఫోర్స్ హెడ్‌కానిస్టేబుల్ సోమలింగం, కానిస్టేబుళ్లు మహేశ్, శ్రీనివాస్, చిరంజీవి, రాజేశ్, రాజు, మహ్మద్ అలీ, సృజన్‌ను సీపీ అభినందించారు.
మెడిసిన్, ఆక్సిజన్ బ్లాక్‌లో విక్రయిస్తే సమాచారం ఇవ్వండి
కరోనా నేపథ్యంలో మార్కెట్లో అందుబాటులో లేని మెడిసిన్, ఆక్సిజన్‌ను బ్లాక్‌లో అధిక ధరలకు విక్రయిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సీపీ తరుణ్‌జోషి తెలిపారు. అవసరమైతే నేరుగా తనను కలిసి సదరు దవాఖాన వివరాలను తెలియచేయవచ్చన్నారు. డయల్ 100 ద్వారా ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఉన్నట్టుండి ఇంటి పెద్ద గుండె నొప్పితో అల్లాడుతున్నా.. పురిటి నొప్పులతో నిండు గర్భిణి అవస్థ పడుతున్నా.. రోడ్డు ప్రమాదంలో గాయపడి విలవిలలాడుతున్నా.. ఇంట్లో ఎవరో ఒకరు ఉన్నట్టుంటి తీవ్ర అస్వస్థతకు గురై ఇబ్బంది పడుతున్నా.. పాముకాట్లు, కరంట్ షాక్‌లకు గురైనా.. ఫోన్ చేసి సమాచారం ఇవ్వగానే ‘నేనున్నా’నంటూ రయ్యిమని దూసుకొచ్చే ‘108’.. ఇప్పుడు కరోనా కష్టకాలంలో ప్రతి ఒక్కరికీ ఆపద్బంధువులా మారింది. ఆపదవస్తే కొవిడ్ కారణంగా వాహనాలు దొరక్క..ఏ దవాఖానకు వెళ్లాలో తెలియక ఆందోళన చెందేవారికి కొండంత భరోసాగా నిలుస్తున్నది. ప్రస్తుతం వైరస్ బాధితులను వెంటనే వైద్యశాలకు తరలించేందుకు విరామమెరుగని సేవలందిస్తున్నది. అత్యవసర సమయంలో నిండు గర్భిణులకు తల్లిలామారి పురుడుకూడా పోస్తున్నది.